త్వరలోనే స్వదేశీ హైపర్‌లూప్‌! ఐఐటీ మద్రాస్‌తో జతకట్టనున్న రైల్వేశాఖ

ABN , First Publish Date - 2022-05-21T08:09:48+05:30 IST

గంటకు 1200 కిలోమీటర్ల వేగంతో ప్ర యాణించే హైపర్‌లూప్‌ టెక్నాలజీపై పని చేస్తున్న ఐఐటీ మద్రాస్‌..

త్వరలోనే స్వదేశీ హైపర్‌లూప్‌! ఐఐటీ మద్రాస్‌తో జతకట్టనున్న రైల్వేశాఖ

చెన్నై(ఆంధ్రజ్యోతి), న్యూఢిల్లీ, మే 20: గంటకు 1200 కిలోమీటర్ల వేగంతో ప్ర యాణించే హైపర్‌లూప్‌ టెక్నాలజీపై పని చేస్తున్న ఐఐటీ మద్రాస్‌.. ఈ సూపర్‌ ప్రా జెక్టు కోసం భారతీయ రైల్వేస్‌తో జతకట్ట నుంది. స్వదేశీ హైపర్‌లూప్‌ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ ఐఐటీ మద్రాస్‌కు సహకరించనుంది. అలాగే ఐఐటీ మద్రాస్‌ క్యాంపస్‌లో హైప ర్‌లూప్‌ టెక్నాలజీకి సంబంధించిన సెంట ర్‌ ఆఫ్‌ ఎక్సెలెన్స్‌ను కూడా ఏర్పాటు చేయ నుందని అధికారులు తెలిపారు. 2017లో అప్పటి రైల్వే శాఖ మంత్రి సురేశ్‌ ప్రభు.. హైపర్‌లూప్‌ ప్రాజెక్టుపై ఆసక్తి వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు కోసం భారత్‌ ఎదు రుచూస్తోందన్నారు. అప్పటి నుంచి ఈ ప్రతిపాదిత ప్రాజెక్టుపై రైల్వేశాఖ, అమె రికాకు చెందిన సంస్థ మధ్య అనేకసార్లు జరిగిన చర్చలు సత్ఫలితాన్ని ఇవ్వలేదు. హైపర్‌లూప్‌ ద్వారా ప్రయాణికులను, సరుకులను తక్కువ సమయంలోనే చేర వేయొచ్చు. దీంతో ఈ ప్రాజెక్టు పై భారత్‌ ఆసక్తి చూపిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ కోసం రైల్వే శాఖ రూ. 8.34 కోట్ల నిధిని ఐఐటీ మద్రాస్‌కు అందించనుంది. ఈ ప్రాజెక్టు కోసం 2017 నుంచి ఐఐటీ మద్రాస్‌కు చెందిన 70 మంది విద్యార్థుల బృందం కృషి చేస్తోంది.

Updated Date - 2022-05-21T08:09:48+05:30 IST