గిరిజన టీచర్లకు హోం ట్యూషన్స్‌ రద్దు

ABN , First Publish Date - 2020-09-25T09:13:18+05:30 IST

గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులు విద్యార్థుల ఇంటికి వెళ్లి బోధించాలన్న ఉత్తర్వులను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఒక్కో విద్యార్థికి రెండు గంటల చొప్పున ప్రతిరోజు ముగ్గురు విద్యార్థుల ఇంటికి వెళ్లి పాఠాలు చెప్పాలని గిరిజనసంక్షేమ శాఖ కమిషనర్‌...

గిరిజన టీచర్లకు హోం ట్యూషన్స్‌ రద్దు

హైదరాబాద్‌, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులు విద్యార్థుల ఇంటికి వెళ్లి బోధించాలన్న ఉత్తర్వులను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఒక్కో విద్యార్థికి రెండు గంటల చొప్పున ప్రతిరోజు ముగ్గురు విద్యార్థుల ఇంటికి వెళ్లి పాఠాలు చెప్పాలని గిరిజనసంక్షేమ శాఖ కమిషనర్‌ ఇచ్చిన ఉత్తర్వులు వివాదాస్పదమయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో కొవిడ్‌ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో అమలు సాధ్యంకాదని, ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని యూటీఎ్‌ఫతోపాటు ఇతర ఉపాధ్యాయ సంఘాలు మంత్రి సత్యవతి రాథోడ్‌కు వినతిపత్రాలు సమర్పించాయి. ఉత్తర్వులను కమిషనర్‌ గురువారం ఉపసంహరించుకున్నారని యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.జంగయ్య, చావ రవి తెలిపారు.  

Updated Date - 2020-09-25T09:13:18+05:30 IST