ఇంటి వైద్యంతో చుండ్రుకి చెక్‌!

ABN , First Publish Date - 2022-01-23T07:00:37+05:30 IST

ఎక్కువశాతం మందిని వేధించే సమస్య చుండ్రు. ఈ మధ్యకాలంలో యువతలో కూడా చుండ్రు సమస్య ఉంటోంది. చుండ్రును పోగొట్టా లంటే.. ...

ఇంటి వైద్యంతో చుండ్రుకి చెక్‌!

ఎక్కువశాతం మందిని వేధించే సమస్య చుండ్రు. ఈ మధ్యకాలంలో యువతలో కూడా చుండ్రు సమస్య ఉంటోంది. చుండ్రును పోగొట్టా లంటే.. బుర్ర హీట్‌ అయ్యేలా ఆలోచించాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే చౌకగా దొరికే వాటి ఆట కట్టించవచ్చు. ఆ హోమ్‌రెమిడీస్‌ ఇవే..

 నిమ్మకాయతో చుండ్రు పని పట్టొచ్చు. నిమ్మలో విటమిన్‌-సి, యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉంటాయి. యాంటీ ఫంగల్‌, యాంటీ బ్యాక్టీరియా లక్షణాలుంటాయి. గోరు వెచ్చని కొబ్బరినూనెకి, నిమ్మరసం జతచేసి జుట్టుకు పట్టించాలి. మంచి ఉపశమనం ఉంటుంది. డాండ్రఫ్‌ పోవటానికి ఇలా నాలుగైదు వారాలు చేయాలి. నేరుగా నిమ్మరసాన్ని పట్టించినా పర్లేదు. ఇందులో ఉండే సిట్రిక్‌ యాసిడ్‌ వల్ల తలలో దురద రాదు. పీహెచ్‌ లెవల్‌ బ్యాలెన్స్‌ అవుతుంది. 

పాకులు, తులసి ఆకులను సమపాళ్లలో తీసుకుని పేస్ట్‌గా రుబ్బాలి. ఆ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి. లేదా అరగంట పాటు వేపాకులు, తులసాకుల్ని అరగంట పాటు నీటిలో మరిగించి చల్లారాక ఆ నీటితో జుట్టును కడగాలి. వేప, తులసి ఆకుతో బ్యాక్టీరియా, ఫంగస్‌, వైరస్‌లు కూడా నశిస్తాయి. చుండ్రు పోవటంతో పాటు జుట్టుకి ఆరోగ్యకరం కూడా.

 మెంతుల్ని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే గ్రైండ్‌ చేయాలి. ఆ పేస్టును కుదుళ్లను తాకేట్లు జుట్టుకు పట్టించాలి. గంట తర్వాత జుట్టును నీటితో శుభ్రపరచుకోవాలి. కంటిన్యూగా నాలుగైదు వారాల పాటు పట్టిస్తే.. చుండ్రు మళ్లీ రావటానికి కూడా సాహసించదు. జుట్టు రాలడం కూడా తగ్గిపోతుంది.

 పెరుగులోకి కోడిగుడ్డుసొన లేదా బ్లాక్‌ పెప్పర్‌ను వేసి మిక్స్‌ చేసి జుట్టుకు పట్టిస్తే మంచి ఫలితం ఉంటుంది. పెరుగుకి, పచ్చపెసర పిండి లేదా అలొవెరా జెల్‌ను వేసి ఆ మిశ్రమాన్ని హెయిర్‌ ప్యాక్‌గా వేస్తే జుట్టు చుండ్రుకు చెక్‌ పెట్టొచ్చు. విటమిన్‌ బి5 తో పాటు పీహెచ్‌ లెవల్‌ను బ్యాలెన్స్‌ చేసే గుణం పెరుగుకి ఉంటుంది. 

 ఆలివ్‌ నూనె పట్టించినా జుట్టులో డాండ్రఫ్‌ తొలగిపోతుంది.  

 ఈ హోమ్‌రెమిడీస్‌తో పాటు సరైన వేళకు తిండి తినాలి. నిద్రలేమి, ఒత్తిడి ఉన్నప్పుడే ఇలాంటి జుట్టు, చర్మ సమస్యలు వస్తాయి. అందుకే ఒత్తిడిని తగ్గించుకోవాలి. రెగ్యులర్‌గా జుట్టుకు కొబ్బరినూనె పట్టించాలి. క్రమం తప్పకుండా యోగా లేదా వాకింగ్‌ చేయడం వల్ల జుట్టు  ఆరోగ్యకరంగా ఉంటుంది.

Updated Date - 2022-01-23T07:00:37+05:30 IST