Advertisement
Advertisement
Abn logo
Advertisement

తక్కువ ఖర్చుతో ముఖం మెరిసిపోతుందిలా...

ఆంధ్రజ్యోతి(26-06-2020)

ఫేస్‌ క్లీనర్స్‌ ఖరీదు ఎక్కవ. పైగా ఇప్పుడు అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లలేని పరిస్థితి. అలాగనీ ఆందోళన అవసరం లేదు. వంటింట్లో లభించే పదార్థాలతో తక్కువ ఖర్చులోనే ఫేస్‌వాష్‌ తయారుచేసుకోవచ్చు. ఎలాగో చూద్దాం...


కావలసినవి: ఓట్స్‌ పొడి- ముప్పావు కప్పు, బాదం గింజల పొడి- రెండు టేబుల్‌ స్పూన్లు, పసుపు- టేబుల్‌స్పూన్‌, సెనగపిండి- అరకప్పు, లావెండర్‌ నూనె- పదిచుక్కలు.


తయారీ: ఒక గిన్నెలో ఓట్స్‌పొడి, పసుపు, బాదం గింజల పొడి, సెనగపిండి, లావెండర్‌ నూనె వేసి బాగా కలిపితే ఫేస్‌క్లీనర్‌ తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని గాలి చొరబడని గాజు సీసాలో భద్రపరచాలి. ముఖం శుభ్రం చేసుకునే ముందు ఒక స్పూన్‌ తీసుకొని ముఖానికి రాసుకోవాలి. 


లాభాలివి: ఓట్స్‌ పొడి సహజ స్క్రబ్బర్‌లా పనిచేస్తుంది. బాదం గింజల పొడి మృతకణాలను తొలగించి ముఖాన్ని కాంతిమంతంగా మారుస్తుంది. పుసుపు చర్మానికి తాజాదనాన్ని ఇస్తుంది. సెనగపిండి చర్మం మీది అదనపు నూనెల్ని గ్రహించి, చర్మ రంధాల్రు తెరచుకునేలా చేస్తుంది. ముఖం మీది మచ్చల్ని, చర్మ మంటను లావెండర్‌ నూనె తగ్గిస్తుంది. 

Advertisement

అందమే ఆనందంమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...