ఇంటి మొక్కల నిర్వహణ ఇలా...!

ABN , First Publish Date - 2020-12-16T06:35:20+05:30 IST

బాల్కనీ మొత్తం పచ్చని మొక్కలతో ఉంటే ఆ లుక్కే వేరు. లివింగ్‌ రూమ్‌లో ఇంపైన మొక్కలు ఉంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఇండోర్‌ ప్లాంట్స్‌ పెంచుకోవాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. బాల్కనీ మొత్తం పచ్చని మొక్కలతో ఉంటే ఆ లుక్కే వేరు. లివింగ్‌ రూమ్‌లో ఇంపైన మొక్కలు ఉంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఇండోర్‌ ప్లాంట్స్‌ పెంచుకోవాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.

ఇంటి మొక్కల నిర్వహణ ఇలా...!

బాల్కనీ మొత్తం పచ్చని మొక్కలతో ఉంటే ఆ లుక్కే వేరు. లివింగ్‌ రూమ్‌లో ఇంపైన మొక్కలు ఉంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఇండోర్‌ ప్లాంట్స్‌ పెంచుకోవాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. 


ఎలాంటి మొక్కలు కొనాలనుకుంటున్నారో అవగాహన ఉండాలి. ఇంట్లో వాటిని ఎక్కడ పెంచాలనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి. 


 కొన్ని మొక్కలకు సూర్యరశ్మి తప్పనిసరి. ఇంకొన్ని సూర్యరశ్మి తగలకపోయినా,  వెలుతురులో  పెరుగుతాయి. స్థలం లభ్యతను బట్టి   మొక్కలు ఎంచుకోవాలి.


కొన్ని మొక్కల వేర్లు బాగా విస్తరిస్తాయి. అలాంటి వాటిని చిన్న కుండీలో పెంచవద్దు.


ఇండోర్‌ ప్లాంట్లకు తక్కువ నీరు అవసరం అవుతుంది. నీరు ఎక్కువ పోసినట్లయితే అవి చనిపోయే అవకాశం ఉంటుంది. వారంలో రెండు సార్లు నీళ్లు అందించినా సరిపోతుంది. కుండీలో ఒక అంగుళం మేర తడి లేనప్పుడు నీళ్లు పోయాలి. 


 ఫంగస్‌ సోకిన ఆకులను వెంటనే తొలగించాలి. లేదంటే అన్ని ఆకులకు ఫంగస్‌ విస్తరించి మొక్క పాడై పోయే ప్రమాదం ఉంటుంది.


నీళ్లలో పెరిగే మొక్కల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ప్రతి పదిహేను రోజులకొకసారి నీళ్లు తప్పనిసరిగా మార్చాలి.


నీళ్లు పోసినప్పుడు బయటకు రాకుండా రెండు కుండీలు లేదా ట్రేలో కుండీ వాడాలి. 

Updated Date - 2020-12-16T06:35:20+05:30 IST