జగనన్న తోడుతో చిరు వ్యాపారులకు లబ్ధి

ABN , First Publish Date - 2021-10-21T05:43:40+05:30 IST

వడ్డీ వ్యాపారస్థుల నుంచి చిరు వ్యాపారులను రక్షించేందుకే రాష్ట్ర ప్రభుత్వం జగనన్న తోడు పథకాన్ని అమలు చేస్తోందని హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు.

జగనన్న తోడుతో చిరు వ్యాపారులకు లబ్ధి
కలెక్టరేట్‌లో జరిగిన జగనన్న తోడు కార్యక్రమంలో పాల్గొన్న హోం మంత్రి సుచరిత, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు

హోం మంత్రి మేకతోటి సుచరిత

గుంటూరు(ఆంధ్రజ్యోతి): వడ్డీ వ్యాపారస్థుల నుంచి చిరు వ్యాపారులను రక్షించేందుకే రాష్ట్ర ప్రభుత్వం జగనన్న తోడు పథకాన్ని అమలు చేస్తోందని హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి జగనన్న తోడు రెండో విడత వడ్డీ జమ కార్యక్రమాన్ని సీఎం జగన్‌ ప్రారంభించగా ఆ కార్యక్రమానికి కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి హోం మంత్రి హాజరయ్యారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణరావు, కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌, ఎమ్మెల్సీ కల్పలత, ఎమ్మెల్యేలు మహమ్మద్‌ ముస్తఫా, మద్ధాళి గిరిధర్‌, జాయింట్‌ కలెక్టర్‌లు ఏఎస్‌ దినేష్‌కుమార్‌, రాజకుమారి, శ్రీధర్‌రెడ్డి, మిర్చియార్డు ఛైర్మన్‌ చంద్రగిరి ఏసురత్నం, నగరపాలకసంస్థ డిప్యూటీ మేయర్‌ షేక్‌ షజీల, డ్వామా పీడీ శ్రీనివాసరెడ్డి, డీఆర్‌డీఏ పీడీ ఆనంద్‌నాయక్‌, డీపీవో కేశవరెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-21T05:43:40+05:30 IST