నేరాలు జరగలేదని మేం అనలేదే..: హోంమంత్రి సుచరిత

ABN , First Publish Date - 2021-09-07T21:54:08+05:30 IST

గుంటూరు: రాష్ట్రంలో నేరాలు జరగలేదని తాము అనలేదే అని హోంమత్రి సుచరిత అన్నారు. మంగళవారం హోమంత్రి మీడియాతో మాట్లాడుతూ.. నేరాలు జరగలేదని తాము అనలేదని. అయితే వాటిని తగ్గించేందుకు చర్యలు

నేరాలు జరగలేదని మేం అనలేదే..: హోంమంత్రి సుచరిత

గుంటూరు: రాష్ట్రంలో నేరాలు జరగలేదని తాము అనలేదే అని హోంమత్రి సుచరిత అన్నారు. మంగళవారం హోమంత్రి మీడియాతో మాట్లాడుతూ.. నేరాలు జరగలేదని తాము అనలేదని.. అయితే వాటిని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అందుకోసమే దిశ చట్టాన్ని తీసుకొచ్చామని గుర్తు చేశారు. నేరస్థులకు సాధ్యమైనంత వేగంగా శిక్షలు పడేలా చట్టాన్ని కఠినతరం చేస్తామన్నారు.  ప్రతిపక్ష నాయకులు కేవలం.. రాజకీయ లబ్ధికోసమే ఆరోపణలు చేస్తున్నారని సుచరిత పేర్కొన్నారు.

Updated Date - 2021-09-07T21:54:08+05:30 IST