నేరాలు తగ్గడం హర్షణీయం..: హోంమంత్రి సుచరిత

ABN , First Publish Date - 2020-08-15T22:00:29+05:30 IST

పోలీస్ శాఖలో నెల్లూరుకు ఐఎస్ఓ సర్టిఫికేట్ రావడం అభినందనీయం అని రాష్ట్ర హోంమంత్రి సుచరిత అన్నారు. శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆమె.. నేరాల సంఖ్య భారీగా

నేరాలు తగ్గడం హర్షణీయం..: హోంమంత్రి సుచరిత

నెల్లూరు: పోలీస్ శాఖలో నెల్లూరుకు ఐఎస్ఓ సర్టిఫికేట్ రావడం అభినందనీయం అని రాష్ట్ర హోంమంత్రి సుచరిత అన్నారు. శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆమె.. నేరాల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టడం హర్షించదగ్గ విషయం అని అన్నారు. 2018లో 714 కేసులు ఉంటే, 2019లో 539, 2020లో ఇప్పటి వరకు 349 కేసులు నమోదయ్యాయని ఆమె పేర్కొన్నారు. చోరీల ఘటనల్లో రికవరీ రేటు కూడా 42శాతం ఉందన్నారు. దిశ పోలీస్ స్టేషన్ ద్వారా మహిళల రక్షణకు చేస్తున్న సేవలు అభినందనీయం అని పేర్కొన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలను విస్తృతంగా అమలు చేస్తున్నామని సుచరిత చెప్పుకొచ్చారు. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు వంటివి గ్రామాల్లో ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలను అందిస్తున్నామని చెప్పారు. త్వరలో 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు అందించబోతున్నామని హోంమంత్రి వెల్లడించారు.

Updated Date - 2020-08-15T22:00:29+05:30 IST