రాష్ట్రంలో భూ ఆక్రమణలపై ఉక్కుపాదం: హోంమంత్రి సుచరిత

ABN , First Publish Date - 2020-09-25T17:33:52+05:30 IST

శాంతి భద్రతల విషయంలో ఎమ్మెల్యేలు తప్పు చేసినా ఉపేక్షించవద్దు అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారని హోంమంత్రి సుచరిత అన్నారు.

రాష్ట్రంలో భూ ఆక్రమణలపై ఉక్కుపాదం: హోంమంత్రి సుచరిత

అనంతపురం: శాంతి భద్రతల విషయంలో ఎమ్మెల్యేలు తప్పు చేసినా ఉపేక్షించవద్దు అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారని హోంమంత్రి సుచరిత అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో భూ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్నామని చెప్పారు. గృహహింస, అత్యాచారాలపై మహిళల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని తెలిపారు. దళితులపై దాడులు జరిగాయని చెప్పడం అవాస్తవమని.. జరుగుతున్న వాటిపై వెంటనే స్పందిస్తున్నామని హోంమంత్రి అన్నారు. డిపార్ట్‌మెంట్‌కు చెందిన వారు తప్పు చేసినా చర్యలు తీసుకుంటున్నామని.. ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేస్తున్నామని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ప్రభుత్వానికి అండగా ఉంటున్నారని చెప్పారు. వారికి ఎలాంటి అన్యాయం జరగదని స్పష్టం చేశారు. ఒకటి, రెండు సంఘటనలను ప్రతిపక్షాలు బూచిగా చూపుతున్నారని మండిపడ్డారు. గతంతో పోలిస్తే నేరాల సంఖ్య తగ్గిందన్నారు. 18 దిశ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేశామని, కేసులను సత్వర్యం పూర్తి చేసేందుకు మూడు పోరెన్సిక్ ల్యాబరేటరీలను తిరుపతి, విశాఖపట్నం , విజయవాడలో ఏర్పాటు చేయబోతున్నామని చెప్పుకొచ్చారు. కేంద్రం అనుమతితో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గతంతో పోలీస్తే ఎస్సీ, ఎస్టీ కేసుల సంఖ్య రాష్ట్రంలో తగ్గిందని హోంమంత్రి సుచరిత తెలిపారు. 

Updated Date - 2020-09-25T17:33:52+05:30 IST