రమ్య కుటుంబ సభ్యులకు ఇంటిస్థల పత్రాలను అందజేసిన హోంమంత్రి

ABN , First Publish Date - 2021-09-11T18:41:21+05:30 IST

నడిరోడ్డుపై దారుణ హత్యకు గురైన రమ్య కుటుంబ సభ్యులను హోంమంత్రి సుచరిత, ఎమ్మెల్యేలు పరామర్శించారు.

రమ్య కుటుంబ సభ్యులకు ఇంటిస్థల పత్రాలను అందజేసిన హోంమంత్రి

గుంటూరు: నడిరోడ్డుపై  దారుణ హత్యకు గురైన రమ్య కుటుంబ సభ్యులను  హోంమంత్రి సుచరిత, ఎమ్మెల్యేలు పరామర్శించారు. ఈ సందర్భంగా రమ్య కుటుంబ సభ్యులకు 5 సెంట్ల ఇంటిస్థలం పత్రాలను హోం మంత్రి  అందజేశారు. అనంతరం సుచరిత మాట్లాడుతూరమ్య కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉందని తెలిపారు. త్వరలో రమ్య సోదరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం 5 ఎకరాల సాగు భూమి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. రమ్య హత్యోదంతం బాధాకరం.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రమ్య హత్య కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామన్నారు.  అలాగే పాలడుగు సామూహిక అత్యాచార ఘటనపై విచారణ సాగుతోందని హోంమంత్రి చెప్పారు. కొన్ని ఆధారాలు దొరికాయని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. విచారణ దశలో పూర్తి వివరాలను వెల్లడిస్తే నిందితులు తప్పించుకునే అవకాశం ఉందని చెప్పారు. నిందితులను పట్టుకున్నాక మీడియా ముందు ప్రవేశపెడతామని హోంమంత్రి సుచరితి తెలిపారు. 


Updated Date - 2021-09-11T18:41:21+05:30 IST