నల్ల తామరతో మిర్చి పూర్తిగా దెబ్బతిన్నది: హోం మంత్రి సుచరిత

ABN , First Publish Date - 2021-12-16T22:25:28+05:30 IST

జిల్లాలో నల్ల తామర పురుగుతో మిర్చి పంట పూర్తిగా దెబ్బతిన్నదని హోం మంత్రి సుచరిత తెలిపారు.

నల్ల తామరతో మిర్చి పూర్తిగా దెబ్బతిన్నది: హోం మంత్రి సుచరిత

గుంటూరు: జిల్లాలో నల్ల తామర పురుగుతో మిర్చి పంట పూర్తిగా దెబ్బతిన్నదని హోం మంత్రి సుచరిత తెలిపారు. గురువారం హోంమంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పంటను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. నల్లతామర పురుగు దెబ్బకు పొలాల్లో పంటను పీకేస్తున్నారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళలో కూడా మిర్చికి నల్లతామర పురుగు ఆశించింది. మిగతా పంటలకు కూడా నల్లతామర పురుగు విస్తరిస్తుంది. మిర్చి పంట దెబ్బతిని భవిష్యత్తులో ధరలు పెరిగి సామాన్యప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఎకరాకు 70వేలు పెట్టుబడిని రైతు నష్టపోతున్నారు. సీఎం జగన్ రైతు పక్షపాతి రైతులకు వీలైనంత సాయం అందేలా చూస్తాం. పంట దెబ్బతిన్న రైతులకు వచ్చే ఏడాది వందశాతం సబ్సిడీతో విత్తనాలు అందించాలని సీఎంను కోరతాం. పంట నష్టపరిహారం కూడా పెంచాలని‌ సీఎం దృష్టిలో పెడతాం’’ అని హోం మంత్రి సుచరిత పేర్కొన్నారు. 

Updated Date - 2021-12-16T22:25:28+05:30 IST