ఆ వార్తలు శుద్ధ అబద్ధం.. ఎవరికీ ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు: ‘మహా’ ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-10-12T21:35:49+05:30 IST

తనపై కొందరు గూఢచర్యం చేస్తున్నట్టు అనుమానంగా ఉందంటూ ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే చేసిన

ఆ వార్తలు శుద్ధ అబద్ధం.. ఎవరికీ ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు: ‘మహా’ ప్రభుత్వం

మహారాష్ట్ర: తనపై కొందరు గూఢచర్యం చేస్తున్నట్టు అనుమానంగా ఉందంటూ ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే చేసిన ఆరోపణలను మహారాష్ట్ర ప్రభుత్వం కొట్టిపడేసింది. బాలీవుడ్ ప్రముఖ నటుడు షారూఖ్‌ఖాన్ కుమారుడు ఆర్యన్‌ఖాన్ కేసును దర్యాప్తు చేస్తున్నది ఆయనే. ముంబై పోలీసులు కొందరు తనపై నిఘా పెట్టి అనుసరిస్తున్నట్టు అనుమానించిన వాంఖడే ఈ విషయాన్ని మహారాష్ట్ర పోలీస్ చీఫ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.


ఈ విషయమై స్పందించిన మహారాష్ట్ర హోం మంత్రి దిలీప్ వాల్సే పాటిల్ ఆ ఆరోపణలను ఖండించారు. ప్రభుత్వం ఎవరికీ, ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. వాంఘెడే తరచు తన తల్లి అంత్యక్రియలు నిర్వహించిన శ్మశాన వాటికకు వెళ్లివస్తుంటారు. ఆ సమయంలో పోలీసు అధికారులమని చెప్పుకుంటున్న ఇద్దరు వ్యక్తులు తనపై నిఘా వేసినట్టు సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా గమనించామని వాంఖడే ఫిర్యాదు చేసినట్టు చెబుతున్నారు.  

Updated Date - 2021-10-12T21:35:49+05:30 IST