విలేఖర్లతో మాట్లాడుతున్న గెడ్డం బుజ్జి, తదితరులు
జనసేన పార్టీ సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి
పాయకరావుపేట, మే 25:అమలాపురం విధ్వంసం వెనుక జనసేన పార్టీ హస్తం ఉందని రాష్ట్ర హోం శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని జనసేన పార్టీ సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో విలేఖరులతో ఆయన మాట్లాడుతూ.. అమలాపురంలో జరిగిన సంఘటన దురదృష్టకరమన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కి హోంమంత్రి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. విలేఖర్ల సమావేశంలో జనసేన పార్టీ నాయకులు బోడపాటి శివదత్, గెడ్డం చైతన్య, ఆకాష్, జగ్గన్నదొర పాల్గొన్నారు.