Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇల్లే వ్యాయామశాల

ఆంధ్రజ్యోతి(05-05-2020):

జిమ్‌కు వెళ్లే వీలు లేదు కాబట్టి వ్యాయామాలకు దూరంగా ఉంటున్నారా? నిజానికి మిగతా రోజులతో పోలిస్తే కరోనా వ్యాపించిన రోజుల్లోనే క్రమం తప్పని వ్యాయామం అవసరం. వ్యాధినిరోధకశక్తిని మెరుగ్గా ఉంచే, ఇంట్లోనే చేయదగిన వ్యాయామాల గురించి, ‘బామ్‌ డిగ్గీ’ పంజాబీ ఇంగ్లీషు పాటతో వెలుగులోకి వచ్చిన ‘జాస్మిన్‌ వాలియా’ ఏం చెబుతున్నారంటే....


‘‘వంట చేయడం, ఇల్లు శుభ్రం చేయడం, తోట పని... ఇవన్నీ వ్యాయామాలే! ఈ పనులను మీరే స్వయంగా చేయడం మొదలు పెట్టండి. వీలైతే సైకిల్‌ తొక్కడం, ఇంటి చుట్టూ పరుగు పెట్టడం అలవాటు చేసుకోండి. చమటలు పట్టేలా, గుండె వేగం పెరిగేలా ఏ పని చేసినా అది వ్యాయామమే! ఇందుకోసం మెట్లు ఎక్కి, దిగడం, బరువైన వస్తువులను తక్కువ దూరాల పాటు మోయడం లాంటి పనులు చేయవచ్చు. పిల్లలతో ఆటలాడడం వల్ల వ్యాయామం చేసిన ఫలం దక్కుతుంది. కాబట్టి సోఫాల్లో జారిపోయి, టివిలకు అతుక్కుపోకుండా ఇంటి పనుల్లో చురుగ్గా పాల్గొనండి.’’

Advertisement
Advertisement