అన్నం ఎక్కువగా తిన్నారా.. అయితే ఈజీగా అరగాలంటే ఇవి ట్రై చేయండి!

ABN , First Publish Date - 2021-11-30T17:48:10+05:30 IST

భారీ భోజనం బాధ, తిన్న తర్వాత మొదలవుతుంది. వరస వేడుకలతో అజీర్తి ఏర్పడి, పొట్టలో అసౌకర్యం వేధిస్తూ ఉంటే ఈ గృహ వైద్యాలు అనుసరించవచ్చు

అన్నం ఎక్కువగా తిన్నారా.. అయితే ఈజీగా అరగాలంటే ఇవి ట్రై చేయండి!

ఆంధ్రజ్యోతి(30-11-2021)

భారీ భోజనం బాధ, తిన్న తర్వాత మొదలవుతుంది. వరస వేడుకలతో అజీర్తి ఏర్పడి, పొట్టలో అసౌకర్యం వేధిస్తూ ఉంటే ఈ గృహ వైద్యాలు అనుసరించవచ్చు.


మెంతి లడ్డు: ఉదయం అల్పాహారంతో పాటు బెల్లం, నెయ్యి కలిపి తయారుచేసిన మెంతి లడ్డు ఒకటి తినాలి.


మజ్జిగ: మధ్నాహ్న భోజనం ముగించిన వెంటనే, ఇంగువ, నల్ల ఉప్పు కలిపిన గ్లాసు మజ్జిగ తాగాలి.


చ్యవన్‌ప్రాశ్‌: రాత్రి నిద్రకు ముందు పాలలో ఒక టీస్పూను చ్యవన్‌ప్రాశ్‌ కలుపుకుని తాగాలి.

Updated Date - 2021-11-30T17:48:10+05:30 IST