6.7 % వడ్డీకే గృహ రుణాలు

ABN , First Publish Date - 2021-03-02T06:32:02+05:30 IST

గృహ రుణాలపై వడ్డీ రేట్లను భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) మరో పది బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతానికి సమా నం) తగ్గించింది. మంచి సిబిల్‌ స్కోర్‌ ఉన్న ఖాతాదారులకు 6.7 శాతం కనీస వడ్డీకే రూ.75 లక్షల వరకు గృహ

6.7 % వడ్డీకే గృహ రుణాలు

నెలాఖరు వరకే ఆఫర్‌ 


ముంబై: గృహ రుణాలపై వడ్డీ రేట్లను భారతీయ స్టేట్‌ బ్యాంక్‌  (ఎస్‌బీఐ) మరో పది బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతానికి సమా నం) తగ్గించింది. మంచి సిబిల్‌ స్కోర్‌ ఉన్న ఖాతాదారులకు 6.7 శాతం కనీస వడ్డీకే రూ.75 లక్షల వరకు గృహ రుణాలు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. రూ.75 లక్షల నుంచి రూ.5 కోట్ల గృహ రుణాలకు మాత్రం 6.75 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది. ఈ నెలాఖరు వరకు ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. ఈ కాలంలో అందించే గృహ రుణాలకు ప్రాసెసింగ్‌ చార్జీలను కూడా ఎస్‌బీఐ రద్దు చేసింది. కాగా ఎస్‌బీఐ యోనో యాప్‌ ద్వారా దరఖాస్తు చేస్తే వడ్డీ రేటులో మరో 5 బేసిస్‌ పాయింట్ల రిబేటు ఇస్తోంది. మహిళలు తీసుకునే గృహ రుణాలపైనా 5 బేసిస్‌ పాయింట్ల వడ్డీ రేటు మినహాయింపు ఉంటుందని ప్రకటించింది. కాగా కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ కూడా గృహ రుణ వడ్డీ రేట్లను 6.65 శాతానికి తగ్గించింది. 

Updated Date - 2021-03-02T06:32:02+05:30 IST