ఆంధ్రాకు మద్యం తరలిస్తున్న హోంగార్డ్ అరెస్ట్

ABN , First Publish Date - 2020-07-11T22:58:02+05:30 IST

పశ్చిమ గోదావరి జిల్లాలో అక్రమ మద్యం రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.

ఆంధ్రాకు మద్యం తరలిస్తున్న హోంగార్డ్ అరెస్ట్

ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లాలో అక్రమ మద్యం రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గురువారం నాడు తెలంగాణ నుంచి ఆంధ్రాకు మద్యం అక్రమంగా తరలిస్తున్న ఎస్ఐ, ఎక్సైజ్ సీఐ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే ఇదే పశ్చిమగోదావరి జిల్లాలో హోంగార్డుతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ కావడం గమనార్హం. అయితే మద్యం విషయంలో పోలీసు శాఖకు చెందిన వారే అరెస్ట్ అవుతుండటం డిపార్ట్‌మెంట్‌కు చెడ్డపేరు వస్తోంది. పూర్తి వివరాల్లోకెళితే.. జిల్లాలోని చింతలపూడి మండలం లింగగూడెం బోర్డర్ చెక్‌పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీలు చేపట్టారు.


ఈ క్రమంలో తెలంగాణ నుంచి ఆంధ్రాలోకి అక్రమంగా బుల్లెట్ వాహనంపై మద్యం రవాణా చేస్తున్న ఏలూరుకు చెందిన హోంగార్డ్ సహా ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్దనుండి 23,750 రూపాయల విలువగల 95 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని జంగారెడ్డిగూడెం డీఎస్పీ స్నేహిత మీడియాకు తెలిపారు.

Updated Date - 2020-07-11T22:58:02+05:30 IST