మద్యం బాటిళ్లు తరలిస్తున్న హోంగార్డు అరెస్టు

ABN , First Publish Date - 2020-04-20T14:54:56+05:30 IST

మలక్‌పేటకు చెందిన ఆర్‌.అనిల్‌కుమార్‌(38) మలక్‌పేట టీఆర్‌ పోలీస్‌‌స్టేషన్‌లో

మద్యం బాటిళ్లు తరలిస్తున్న హోంగార్డు అరెస్టు

హైదరాబాద్/వనస్థలిపురం : మలక్‌పేటకు చెందిన ఆర్‌.అనిల్‌కుమార్‌(38) మలక్‌పేట టీఆర్‌ పోలీస్‌‌స్టేషన్‌లో రెండేళ్లుగా హోంగార్డుగా పనిచేస్తున్నాడు. సూర్యాపేట జిల్లా నుంచి మారుతి ఎర్టీగా కారు (టీఎస్‌ 29జీ 6198)లో మద్యం బాటిళ్లను నగరానికి తరలిస్తుండగా పనామా వద్ద వనస్థలిపురం పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. 36మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ వెంకటయ్య తెలిపారు. 

 

Updated Date - 2020-04-20T14:54:56+05:30 IST