ఇంటి మొక్కల సంరక్షణ ఇలా...

ABN , First Publish Date - 2020-06-01T05:30:00+05:30 IST

ఇంటి ఆవరణలో ఇష్టంగా పెంచుకుంటున్న మొక్కల విషయంలో వేసవిలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే చీమలు వాటి మీద చేరి మొక్కల పెరుగుదలను అడ్డుకుంటాయి. ఆకుల మీద, కుండీలోని మట్టి మీద మకరందం చేరడం, వాటికి ఆహారమైన పురుగులు ఉండడంతో చీమలు కనిపిస్తాయి...

ఇంటి మొక్కల సంరక్షణ ఇలా...

ఇంటి ఆవరణలో ఇష్టంగా పెంచుకుంటున్న మొక్కల విషయంలో వేసవిలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే చీమలు వాటి మీద చేరి మొక్కల పెరుగుదలను అడ్డుకుంటాయి. ఆకుల మీద, కుండీలోని మట్టి మీద మకరందం చేరడం, వాటికి ఆహారమైన పురుగులు ఉండడంతో చీమలు కనిపిస్తాయి. రసాయనాలు ఉపయోగించకుండా ఇంటివద్దనే తయారుచేసుకున్న క్రిమినాశకాలతో చీమల బెడద వదులుతుంది. ఎలాగో చూద్దాం...


  1. చీమలను పారదోలేందుకు నిమ్మకాయ తీసుకోండి. దీనిలోని సిట్రిక్‌ ఆమ్లాన్ని చీమలు ఇష్టపడవు. అందుచేత పండు నిమ్మకాయ తొక్కను పొడిగా చేసి మొక్కల మీద చల్లితే చీమలు పట్టవు. 
  2. ఎక్కువ మొత్తంలో చీమలు ఉన్నట్లయితే నిమ్మకాయ, నారింజ తొక్కలను నీటిలో 15 నిమిషాలు వేడి చేయండి. చల్లారిన తర్వాత ఆ నీటిని మొక్కల మీద చిలకరించండి.
  3. సబ్బు నీళ్లు చల్లితే కూడా చీమలు దరిచేరవు. టీ స్పూన్‌ డిష్‌వాష్‌ లిక్విడ్‌ లేదా సబ్బు నీళ్లను వేడినీళ్లలో కలపాలి. ఈ ద్రావణాన్ని ఉపయోగిస్తే చీమల సమస్య తగ్గుతుంది.
  4. ఇంట్లో పెప్పరమింట్‌ నూనె ఉంటే సాయంత్రం వేళ మొక్కల మీద చల్లాలి. ఉదయాన్నే మంచినీళ్లు చల్లితే సరి.
  5. దాల్చినచెక్క, లవంగాలు, కారంపొడి, కాఫీ గింజల పొడి, ఎండబెట్టిన పుదీనా టీ ఆకులను మొక్క మొదలు భాగంలో ఉంచితే చీమలు పట్టవు.


ఇంటి లోపల ఉంచే మొక్కల రక్షణ...

అలంకరణ మొక్కలను లివింగ్‌ రూమ్‌లో లేదా కిటికీల పక్కన పెంచుతున్న వారు కిచెన్‌, డైనింగ్‌ టేబుల్‌, హాలులో ఆహారపదార్థాలు పడకుండా చూసుకోవాలి. ఒకవేళ కిందపడినా వెంటనే శుభ్రం చేయాలి. ఆహారాన్ని మూతలున్న గిన్నెలలో ఉంచాలి. గాలి చొరబడని సీసాలో ఉంచినా కూడా చీమలు, ఇతర పురుగుల సమస్య తగ్గుతుంది. దాంతో మొక్కలు తాజాగా, ఆరోగ్యంగా పెరుగుతాయి.


Updated Date - 2020-06-01T05:30:00+05:30 IST