తపారియా నుంచి హోమ్‌, వెహికల్‌ టూల్‌ కిట్స్‌

ABN , First Publish Date - 2022-08-01T07:12:18+05:30 IST

హ్యాండ్‌టూల్స్‌ విభాగంలో అగ్రగామి తపారియా టూల్స్‌ లిమిటెడ్‌ (టీటీఎల్‌) ఇటీవల గృహిణులు, పిల్లలు, వాహన యజమానుల కోసం టూల్స్‌ కిట్లు విడుదల చేసింది.

తపారియా నుంచి హోమ్‌, వెహికల్‌ టూల్‌ కిట్స్‌

హైదరాబాద్‌ : హ్యాండ్‌టూల్స్‌ విభాగంలో అగ్రగామి తపారియా టూల్స్‌ లిమిటెడ్‌ (టీటీఎల్‌) ఇటీవల గృహిణులు, పిల్లలు, వాహన యజమానుల కోసం టూల్స్‌ కిట్లు విడుదల చేసింది. గత కొద్ది కాలంగా ‘‘చిన్న చిన్న ఫిటింగ్‌లు స్వయంగా చేసుకునే ధోరణి’’ పెరిగినందు వల్ల ఈ కిట్లు వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని కంపెనీ తెలిపింది. ఈ విభాగంలో మంచి వృద్ధి అవకాశాలున్నట్టు కూడా భావిస్తున్నట్టు పేర్కొంది. ఈ ఉత్పత్తులను షాపింగ్‌ మాల్స్‌, యుటిలిటీ గృహోపకరణాల స్టోర్లలో ప్రదర్శనకు ఉంచినట్టు తెలిపింది. వ్యవస్థీకృత టూల్స్‌ రంగంలో తమ కంపెనీ 70-75 శాతం మార్కెట్‌ వాటా కలిగి ఉన్నదని, నాణ్యతకు పెద్దపీట వేయడం వల్ల వినియోగదారులు తమ ఉత్పత్తులను ఆదరిస్తున్నారని కంపెనీ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అన్నారు.

Updated Date - 2022-08-01T07:12:18+05:30 IST