కరోనా తొలగాలంటూ హోమాలు

ABN , First Publish Date - 2020-04-09T09:53:50+05:30 IST

ప్రజలకు కరోనా కష్టాలు తొలగి సుఖశాంతులతో జీవించాలని బుదవారం పట్టణంలోని ఆలయాల్లో హోమాలు నిర్వహించా రు. వాసవీ కన్యకాపరమేశ్వరిదేవి ఆలయంలో

కరోనా తొలగాలంటూ హోమాలు

ప్రొద్దుటూరు టౌన్‌, ఏప్రిల్‌ 8: ప్రజలకు కరోనా కష్టాలు తొలగి సుఖశాంతులతో జీవించాలని బుదవారం పట్టణంలోని ఆలయాల్లో హోమాలు నిర్వహించారు. వాసవీ కన్యకాపరమేశ్వరిదేవి ఆలయంలో ఆర్యవైశ్య సభ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య సభ అధ్యక్షుడు బుశెట్టి రామమోహన్‌రావు దంపతులు ధన్వంతరి హోమం, మహామృత్యుంజయ హోమం,  లక్ష్మీనారాయణ సమేత సుదర్శనహోమం నిర్వహించారు. ఈ సందర్భంగా బుశెట్టి రామమోహన్‌రావు మాట్లాడుతూ కరోనా నుంచి ప్రజలకు విముక్తి కలగాలని, పోలీసు, మున్సిపల్‌, ఆరోగ్యశాఖ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వారికి సహకరిస్తున్న దాతలు, వారి కుటుంబ సభ్యులు అందరూ సుఖశాంతులతో ఉండాలని హోమాలు నిర్వహించినట్లు తెలిపారు. 


అగస్త్యేశ్వరస్వామి ఆలయంలో: కరోనా వైరస్‌ నుంచి ప్రజలను కాపాడాలని ఆల య ఛైర్మన్‌ ఎస్‌.రాంప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో మహామృత్యుంజయ హోమం నిర్వహించారు. ఆలయ పండితులు శాస్త్రోక్తంగా పట్టు వస్త్రాలు, హోమద్రవ్యాలను పూర్ణాహుతి సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు ఈవో రామచంద్రాచార్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-04-09T09:53:50+05:30 IST