Oct 24 2021 @ 14:21PM

హాలీవుడ్‌లో టాలెంట్ చూపిస్తానంటోన్న తెలుగు హీరో

సంచలన దర్శకుడు మారుతి దర్శకత్వంలో రూపొందిన ‘భద్రం బికేర్ ఫుల్ బ్రదరూ..’ చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన తెలుగు నటుడు రాజ్ దాసిరెడ్డి. ప్రస్తుతం ఆయన ‘హలో హాలీవుడ్’ అంటూ హాలీవుడ్‌లో కెరీర్‌ను తీర్చిదిద్దుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇంజనీరింగ్‌లో టాపర్‌గా నిలిచి, ‘న్యూయార్క్ ఫిల్మ్ అకాడమి’లో శిక్షణ పొందిన రాజ్ దాసిరెడ్డి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా హాలీవుడ్‌లో తను చేయబోతున్న చిత్ర వివరాలను త్వరలోనే ప్రకటిస్తానని తెలియజేశారు. 


ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇటీవల సైమా అవార్డ్స్‌లో పాల్గొనడం చాలా సంతోషాన్నిచ్చింది. తెలుగువారంతా గర్వపడేలా హాలీవుడ్‌లో నా కెరీర్ తీర్చిదిద్దుకుంటాను. తెలుగులోనూ కొన్ని చిత్రాల కోసం చర్చలు జరుగుతున్నాయి. ప్రియతమ ప్రధాని నరేంద్రమోడీగారి నుంచి శుభాకాంక్షలు అందుకోవడం చాలా గర్వంగా ఉంది. అతి త్వరలోనే నేను హాలీవుడ్‌లో చేయబోతోన్న చిత్ర వివరాలను అధికారికంగా ప్రకటిస్తాను. సపోర్ట్ చేస్తున్న అందరికీ ధన్యవాదాలు..’’ అని తెలిపారు.