డీఈఓ ఆఫీసు ఎదుట ఆందోళన కొనసాగిస్తున్న తెలుగుయువత నాయకులు
తెలుగుయువత ఆందోళన
అనంతపురం వైద్యం, జనవరి 21: కరోనా తీవ్రత తగ్గే వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని డీఈఓ కార్యాల యం ఎదుట తెలుగుయువత శుక్రవారం నిరసనకు దిగింది. దాదాపు గంటపాటు ఆందోళన చేస్తూ పాఠశాలలకు సెలవులు ఇచ్చి పిల్లల ప్రాణాలు కాపాడా లని నినాదాలు చేశారు. అనంతరం డీఈఓ శామ్యూల్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలు గుయువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణస్వామి, తెలుగుయువత అనంత పార్లమెంటు ప్రధాన కార్యదర్శి సుధాకరయాదవ్ మాట్లాడుతూ థర్డ్‌వేవ్ కరోనా ఉధృతంగా ఉన్న నేపథ్యంలో పాఠశాలలు నడపడం సమంజసం కాదన్నారు. ఇతర రాషా్ట్రల్లో సెలవులు ఇచ్చినా మన రాష్ట్ర ప్రభుత్వం పి ల్లల ప్రాణాలతో చెలగాటమాడుతోందని వి మర్శించారు. కొవిడ్ తీవ్రత తగ్గే వరకు ఆనలైన క్లాసులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. పిల్లలు కరోనా బారిన పడితే అందుకు వైసీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. కార్యక్రమంలో తెలుగుయువత నాయకులు బొమ్మినేని శివ, మద్దినేని కృష్ణ, నరేష్, భరత, నాగరాజు, గణేష్, పెద్దన్న, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.