తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగించే అవకాశం

ABN , First Publish Date - 2022-01-15T23:36:12+05:30 IST

తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో కరోనా ఉద్థృతి దృష్ట్యా ప్రభుత్వం సెలవులను పొడగించాలని భావిస్తోంది

తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగించే అవకాశం

హైదరాబాద్: తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో కరోనా ఉద్థృతి దృష్ట్యా ప్రభుత్వం  సెలవులను పొడగించాలని భావిస్తోంది. సెలవుల పొడిగింపుపై ప్రభుత్వానికి ఆరోగ్య శాఖ సూచించినట్లు సమాచారం. రాష్ట్రంలోని విద్యాసంస్థల సెలవుల పొడగింపుపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. గతంలో తెలంగాణ విద్యా శాఖ జనవరి 8 నుంచి 16 వరకు ప్రకటించిన సెలవులు ఆదివారంతో ముగుస్తున్నందున ఈ విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సెలవులు ప్రకటించిన తర్వాత కరోనా, ఒమైక్రాన్‌ కేసులు దేశవ్యాప్తంగా భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సెలవులు పొడగించాలా? వద్దా అన్న అంశంపై ఇటు తెలంగాణ ప్రభుత్వం, అటు రాష్ట్ర విద్యాశాఖ వర్గాల్లో తర్జనభర్జన జరుగుతున్నట్లు తెలిసింది.

Updated Date - 2022-01-15T23:36:12+05:30 IST