ఆర్డీఎస్‌ కెనాల్‌కు రంధ్రాలు

ABN , First Publish Date - 2022-06-30T05:30:00+05:30 IST

జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలంలో ఆర్డీఎస్‌ మెయిన్‌ కెనాల్‌ ఇరుపక్కల ఉన్న గోడలు శిథిలావస్థకు చేరి రంధ్రాలు పడటంతో సాగునీరు వృథాగా పోతోంది.

ఆర్డీఎస్‌  కెనాల్‌కు రంధ్రాలు

శిథిలావస్థకు చేరిన సైడ్‌వాల్స్‌  

బీడు భూములుగా మారిన వందలాది ఎకరాలు 

 వడ్డేపల్లి, జూన్‌ 30: జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలంలో ఆర్డీఎస్‌ మెయిన్‌ కెనాల్‌ ఇరుపక్కల ఉన్న గోడలు శిథిలావస్థకు చేరి రంధ్రాలు పడటంతో సాగునీరు వృథాగా పోతోంది. మరోవైపు కొందరు కాల్వకు రంధ్రాలు చేసి నీటిని మళ్లించుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. దీంతో చివరి ఆయకట్టుకు నీరందడం లేదని రైతులు వాపోతున్నారు. కాల్వలు రంధ్రాల పడి నీరంతా వాగులు, వంకల్లో కలుస్తోంది. ముఖ్యంగా డిస్ర్టిబ్యూటరీ-22, 23, 24 ప్రాంతాల పరిధిలో కెనాల్‌కు పడిన రంధ్రాలను పూడ్చాలని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

చివరి ఆయకట్టుకు నీరు పారడం లేదు 

 డీ-22, 23, 24 కాల్వల్లో ఇరుపక్కల ఎక్కువ శాతం రంధ్రాలు ఉన్నాయి. దాంతో నీరు వృథాగా పోతోంది. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా మరమ్మతులు చేపట్టి, చివరి ఆయకుట్టుకు నీరందేలా చూడాలి.

- మద్దిలేటి, రైతు, తనగల




Updated Date - 2022-06-30T05:30:00+05:30 IST