ఉధృతంగా హొగనేకల్‌ జలపాతం

ABN , First Publish Date - 2022-05-19T18:17:47+05:30 IST

భారీ వర్షాల వల్ల ధర్మపురి జిల్లా హొగనేకల్‌లో జలపాతంలో ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో జిల్లా కలెక్టర్‌ పర్యాటకులను అప్రమత్తంగా ఉండాలని

ఉధృతంగా హొగనేకల్‌ జలపాతం

                      - పర్యాటకుల బోటింగ్‌ రద్దు: కలెక్టర్‌


హోసూరు(బెంగళూరు): భారీ వర్షాల వల్ల ధర్మపురి జిల్లా హొగనేకల్‌లో జలపాతంలో ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో జిల్లా కలెక్టర్‌ పర్యాటకులను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. కావేరి నది సూమారు 29 వేల క్యూబిక్‌ అడుగుల వద్ద పొంగి పొర్లుతోంది. పర్యాటకులు నదిలో స్నానం చేయడానికి, బోటింగ్‌కు అనుమతి లేదని ధర్మపురి జిల్లా కలెక్టర్‌ దివ్యదర్శిని ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితిల్లోనూ నదిని దాటేందుకు బోటింగ్‌కు వెళ్లరాదని సూచించారు. అవసరమైన చోట్ల బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు, ప ర్యాటకులు పూర్తిగా సహకరించి ప్రమాదాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.

Updated Date - 2022-05-19T18:17:47+05:30 IST