హోర్డింగ్‌లను తొలగించాలి

ABN , First Publish Date - 2022-08-13T05:11:32+05:30 IST

రిమ్స్‌ ప్రధాన గేటు ఎదురుగా ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లను తొలగించాలని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యుడు ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు.

హోర్డింగ్‌లను తొలగించాలి
రోడ్డుపై పడి ఉన్న హోర్డింగ్‌

కడప(సెవెనరోడ్స్‌), ఆగస్టు 12 : రిమ్స్‌ ప్రధాన గేటు ఎదురుగా ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లను తొలగించాలని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యుడు ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. హోర్డింగ్‌లు గాలికి రోడ్డుపై అడ్డంగా పడిపోయి వాహనదారులకు, ఆస్పత్రికి వచ్చే రోగులకు ఇబ్బందులు కలుగజేస్తున్నాయన్నారు. రిమ్స్‌ ఆస్పత్రి ఎదుట ప్రైవేటు ఆస్పత్రులకు చెందిన వివిధ రకాల ప్రకటనల బోర్డులను నాసిరకంగా ఏర్పాటు చేయడం వల్ల చిన్నపాటి గాలికే రహదారిపై పడిపోతున్నాయని, తక్షణం వాటిని అక్కడి నుంచి తొలగించాలని కోరారు. గతంలో ఓ ప్రకటన బోర్డు ఇందిరానగర్‌లో నివాసం ఉంటున్న ఓ స్కూటరిస్టుపై పడటంతో కాలు విరిగి చికిత్సపొందుతున్నారని గుర్తు చేశారు. ప్రకటన బోర్డులతో గాయపడిన వ్యక్తి కుటుంబానికి ఆ సంబంధిత బోర్డు యాజమాన్యం వారు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2022-08-13T05:11:32+05:30 IST