హెచ్‌ఎంలు బాధ్యతగా వ్యవహరించాలి

ABN , First Publish Date - 2021-12-01T05:14:14+05:30 IST

ప్రభుత్వ ఆదేశాలు, సూచనలకు అనుగుణంగా ప్రధా నోపాధ్యాయులు బాధ్యతాయుతంగా విధులను నిర్వహించాలని డీఈవో బి.లింగేశ్వరరెడ్డి అన్నారు. నౌపడా ఆర్‌ఎస్‌ ప్రణవి డిగ్రీ కళాశాల ఆవరణలో మంగళవారం టెక్కలి డివిజన్‌ స్థాయి హెచ్‌ఎంల సమావేశం నిర్వహించారు.

హెచ్‌ఎంలు బాధ్యతగా వ్యవహరించాలి
మాట్లాడుతున్న డీఈవో లింగేశ్వరరెడ్డి

 డీఈవో లింగేశ్వరరెడ్డి

టెక్కలి: ప్రభుత్వ ఆదేశాలు, సూచనలకు అనుగుణంగా ప్రధా నోపాధ్యాయులు బాధ్యతాయుతంగా విధులను నిర్వహించాలని డీఈవో బి.లింగేశ్వరరెడ్డి అన్నారు. నౌపడా ఆర్‌ఎస్‌ ప్రణవి డిగ్రీ కళాశాల ఆవరణలో మంగళవారం టెక్కలి డివిజన్‌ స్థాయి హెచ్‌ఎంల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉన్నత పాఠ శాలల్లో విలీన మైన ప్రాథమిక పాఠశాలల పని తీరును పర్యవేక్షించాలన్నారు. రికా ర్డుల నిర్వహణతో పాటు యాప్‌ల వినియోగం తప్పనిసరిగా అమలు చేయాల న్నా రు. సమావేశంలో ఏఎంఓ కృష్ణంరాజు, ఉపవిద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు, ఎం ఈవో ఎస్‌.దేవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు. 


 విస్తృతంగా తనిఖీలు

నందిగాం: జిల్లా విద్యా శాఖాధికారి బి.లింగేశ్వర రెడ్డి మంగళవారం నందిగాంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.  మెయిన్‌ ప్రాఽథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల, ఎంఆర్‌సీ, భవిత కేంద్రాలను సందర్శించి పలు అంశాలపై ఆరా తీశారు. మధ్యాహ్న భోజన పఽథకం అమలు, విద్యార్థుల విద్యా సామర్ధ్యం, బోధనలను పరిశీలించారు. ఆయనతో పాటు హెచ్‌ ఎంలు పి.మల్లేశ్వరరావు, వై.హరిబాబు, ఎంఐఎస్‌ కోఆర్డినేటర్‌ ఏ.ప్రసాదరావు తదితరులున్నారు. 

 

Updated Date - 2021-12-01T05:14:14+05:30 IST