హిజాబ్‌పై పోరాటం సరికాదు...

ABN , First Publish Date - 2022-03-19T18:18:55+05:30 IST

హిజాబ్‌ వివాదంపై పోరాటం సరికాదని పద్మశ్రీ అవార్డు గ్రహీత అబ్దుల్‌ఖాదర్‌ అభిప్రాయపడ్డారు. ఆయన హుబ్లీలో మీడియాతో మాట్లాడుతూ... హిజాబ్‌ వివాదంపై హైకోర్టు

హిజాబ్‌పై పోరాటం సరికాదు...

బెంగళూరు: హిజాబ్‌ వివాదంపై పోరాటం సరికాదని పద్మశ్రీ అవార్డు గ్రహీత అబ్దుల్‌ఖాదర్‌ అభిప్రాయపడ్డారు. ఆయన హుబ్లీలో మీడియాతో మాట్లాడుతూ... హిజాబ్‌ వివాదంపై హైకోర్టు తీర్పును పాటించాలన్నారు. చట్టానికి అనుగుణంగా వ్యవహరించాలన్నారు. ఏ దేశంలో ఉంటే అందుకు సంబంధించిన చట్టాలు, న్యాయవ్యవస్థలకు అనుగుణంగా ఉండాల్సి ఉంటుందన్నారు. హిజాబ్‌ విషయంపై మరిన్ని వివాదాలు సరికావన్నారు. బాలికలకు విద్య ముఖ్యమన్నారు. కాగా హిజాబ్‌తో కళాశాలలకు హాజరుకారాదనే తీర్పు ఉన్నా పలుచోట్ల విద్యార్థులు పాటించడం లేదు. దక్షిణకన్నడ జిల్లా ఉప్పినంగడి పీయూ కళాశాలకు పలువురు విద్యార్థినులు హిజాబ్‌తోనే వచ్చారు. కళాశాల పాలకవర్గం హైకోర్టు తీర్పుకు అనుగుణంగా అనుమతులు లేవని తెలిపిన మేరకు పరీక్షలను బహిష్కరించి వెనుతిరిగారు. ఇదే సందర్భంలో కొందరు గుంపుగా వచ్చిన వారు ప్రిన్సిపాల్‌తో పాటు అధ్యాపకులతో వాగ్వాదానికి దిగారు. పరీక్షలు రాయకుంటే వారి భవిష్యత్‌ దెబ్బతింటుందని డిమాండ్‌  చేశారు. అందుకు ప్రిన్సిపాల్‌ సహా అధ్యాపకులు కోర్టు ఆదేశాలను అందరూ గౌరవించాల్సిందేనని సూచించారు. 

Updated Date - 2022-03-19T18:18:55+05:30 IST