హెచ్‌ఐవీపై అవగాహన అవసరం

ABN , First Publish Date - 2021-12-02T06:44:19+05:30 IST

హెచ్‌ఐవీపై అవగాహన అవసరం

హెచ్‌ఐవీపై అవగాహన అవసరం
గన్నవరంలో ఎయిడ్స్‌ డే ర్యాలీ

గన్నవరం, డిసెంబరు 1 : హెచ్‌ఐవీ/ ఎయిడ్స్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌ మన్నే సుందరరావు అన్నారు. ప్రపంచ ఎయిడ్స్‌ డే సందర్భంగా బుధవారం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సుందరరావు మాట్లాడుతూ ఎయిడ్స్‌ నివారణ అందరి బాధ్యత అన్నారు. ప్రజలకు ఎయిడ్స్‌ వ్యాధి గురించి వివరించాలన్నారు. ఎయిడ్స్‌ ప్రాణాంతక వ్యాధి కాదని, దురఅలవాట్లకు బానిసైతే ఈ వ్యాధి బారిన పడతారని చెప్పారు. ఆస్పత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శార మ్మ, హనుమంతరావు, రాజశేఖర్‌, కిరణ్‌, దివ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే చిన ఆవుటపల్లి డాక్టర్‌ సి.శోభనాద్రి నర్సింగ్‌ కళాశాల విద్యార్ధులు ర్యాలీ నిర్వహించారు. 

కాటూరు(ఉయ్యూరు)  : ప్రపంచ ఎయిడ్స్‌ డేని పుర స్కరించుకుని కాటూరు పీహెచ్‌సీ ఆధ్వర్యంలో బుధవారం కాటూరులో ఎయిడ్స్‌పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆరోగ్య కేంద్ర వైద్యురాలు బేగం సబీహా ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ హెచ్‌ఐవీ వైరస్‌ సోకి శరీరంలో వ్యాప్తి చెంది  ఎయిడ్స్‌గా మారుతుందన్నారు. వ్యాధికి గురైన వారికి ప్రభుత్వం ఏఆర్టీ వైద్యం ద్వారా ఉచితంగా మందులు అందజేసుందన్నారు. వ్యాధి నిర్ధారణకు   ఐసీటీసీ సెంటర్లు ప్రతి డివిజన్‌లో ఏర్పాటు చేశారని తెలిపారు.  వైద్యశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆరుగురు  లెప్రసీ రోగులకు  నిత్యావసర సరుకులు అంద జేశారు.  సుధీర్‌, ఆరోగ్య విస్తరణ అధికారి పి.నాగార్జునబాబు, రమణ, శ్రీనివాస్‌, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.

 ఉయ్యూరు రోటరీక్లబ్‌ ఆధ్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్‌ డే, న్యాయ విజ్ఞాన సదస్సు  నిర్వహించారు. జూనియర్‌ సివిల్‌ జడ్జి బి.బేబీరాణి, తిరుమలరావు, అనీస్‌, అడ్వకేట్‌  చంటిబాబు, శ్రీనివాసరావు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-02T06:44:19+05:30 IST