Heartbreaking : తలసేమియాతో బాధపడుతున్న బాలుడికి హెచ్ఐవి - పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు

ABN , First Publish Date - 2022-08-08T22:09:50+05:30 IST

Hyderabad: హైదరాబాద్‌కు చెందిన మూడేళ్ల బాలుడికి హెచ్ఐవీ (HIV) నిర్ధారణ అయ్యింది. బాలుడు తలసేమియా వ్యాధితో బాధపడుతుండడంతో వైద్యుల సూచనమేరకు 20 రోజులకు ఒకసారి రక్తాన్ని ఎక్కిస్తున్నారు. బాలుడికి హెచ్ఐవీ ఉందని తేలడంతో రెడ్‌క్రాస్

Heartbreaking : తలసేమియాతో బాధపడుతున్న బాలుడికి హెచ్ఐవి - పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు

Hyderabad: హైదరాబాద్‌కు చెందిన మూడేళ్ల బాలుడికి హెచ్ఐవీ (HIV) నిర్ధారణ అయ్యింది. బాలుడు తలసేమియా వ్యాధితో బాధపడుతుండడంతో వైద్యుల సూచనమేరకు 20 రోజులకు ఒకసారి రక్తాన్ని ఎక్కిస్తున్నారు. బాలుడికి హెచ్ఐవీ ఉందని తేలడంతో రెడ్‌క్రాస్ బ్లడ్‌ బ్యాంకు సిబ్బందిపై బాలుడి తల్లిదండ్రులు నల్లకుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రెడ్‌క్రాస్ బ్లడ్‌ బ్యాంకు నుంచి సేకరించిన రక్తంతోనే తమ కొడుకుకు హెచ్ఐవీ సోకిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.


బాలుడి తండ్రి మాట్లాడుతూ..‘‘పుట్టినప్పటి నుంచి మా కొడుకు తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడు. వైద్యుల సూచనమేరకు 20 రోజులకు ఒకసారి రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంకు నుంచి సేకరించిన రక్తాన్ని ఎక్కిస్తున్నాం. గత రెండేళ్ల నుంచి నల్లకుంట‌లోని రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంక్‌ నుంచి రక్తాన్నితీసుకుంటున్నాం. మా కొడుకును హెచ్‌ఐ‌‌వి అని తేలడంతో రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంకుపై హైదరాబాద్ నల్లకుంట పోలీస్ స్టేషన్‌లో జూలై 30న ఫిర్యాదు చేశాను. అనంతరం నేను, నా భార్య హెచ్‌ఐ‌వి టెస్ట్ చేయించుకున్నాం. ఇద్దరికి నెగిటివ్ వచ్చింది. రెడ్ క్రాస్ సిబ్బంది మాత్రం మేము ఆరు నెలల నుంచి బ్లడ్ బ్యాంకుకు రాలేదని పోలీసులకు చెబుతున్నారు. మా దగ్గర ఉన్న ఆధారాలను పోలీసులకు ఇచ్చాం. పోలీసులే మాకు న్యాయం చేయాలి’ అని డిమాండ్ చేస్తున్నారు.  

Updated Date - 2022-08-08T22:09:50+05:30 IST