Abn logo
Sep 23 2021 @ 00:00AM

దిండుతో కొట్టుకోవడం కూడా ఆటే!

పిల్లలు దిండుతో కొట్టుకుంటే తల్లిదండ్రులు ఆపుతారు. కానీ అక్కడ మాత్రం దిండుతో కొడితే పాయింట్లు ఇస్తారు. ఎక్కువ మందికి తగిలేలా కొడితే విజేతలుగా ప్రకటిస్తారు. ఎందుకంటే అక్కడ పిల్లో ఫైటింగ్‌ను ఒక ఆటగా గుర్తిస్తారు. 


జపాన్‌లో ఏటా పిల్లో ఫైటింగ్‌ చాంపియన్‌ షిప్‌ పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీల్లో ఆటగాళ్లు ఉత్సాహంగా పాల్గొంటారు. ఈ ఆట ఎలా ఉంటుందంటే... ఇండోర్‌ స్టేడియంలో ఒక ప్రదేశంలో రెండు టీమ్‌లు ఎదురెదురుగా ఉంటాయి. ఒక్కో టీమ్‌లో ఒక వ్యక్తి దుప్పటితో ఉంటాడు. అతడు అవతలి టీం సభ్యులు విసిరేసే పిల్లోలు తగలకుండా అడ్డుకుంటాడు. ఈ గేమ్‌లో పిల్లో తగిలితే అతన్ని అవుట్‌గా పరిగణిస్తారు. అతడు కోర్టులో నుంచి పక్కకు వెళ్లాల్సి ఉంటుంది. అలా టీంలో సభ్యులందరూ అవుట్‌ అయితే వాళ్లు ఓడిపోయినట్టు.


2013 నుంచి ఏటా ఫిల్లో ఫైటింగ్‌ చాంపియన్‌షిప్‌ పేరుతో పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ గేమ్‌లో ఆటగాళ్లందరూ ప్రత్యేక దుస్తులు ధరించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రత్యేకంగా రూపొందించిన పిల్లోలను మాత్రమే ఉపయోగిస్తారు. ఈ గేమ్‌ను పిల్లల నుంచి వయసు పైబడిన వారి వరకు అందరూ బాగా ఎంజాయ్‌ చేస్తుంటారు. 


ప్రత్యేకం మరిన్ని...