Advertisement
Advertisement
Abn logo
Advertisement

అతను బైక్‌పై వస్తూ పొరపాటున కారును ఢీకొన్నాడు.. అంతే.. కారులోని వారంతా కిందకు దిగి.. ఏం చేశారంటే..

మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ నేత రాకేష్ కుకరేజ్ దగ్గర పనిచేసే డ్రైవర్ సునీల్ నామదేవ్‌ దారుణ హత్యకు గురయ్యాడు. సునీల్ తాను చేసిన చిన్నపొరపాటుకు జీవితాన్నే చాలించాల్సివచ్చింది. అతను వెళుతున్న బైక్ ఒక కారును పొరపాటున ఢీకొంది. ఈ నేపధ్యంలో సునీల్‌కు కారులోని వ్యక్తులకు మధ్య గొడవ జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన కారులోని వ్యక్తులు సునీల్‌పై కత్తులతో దాడిచేసి హతమార్చారు. మర్నాటి ఉదయం అతని ఇంటికి వంద మీటర్ల దూరంలో అతని మృతదేహం లభ్యమయ్యింది. అక్కడే అతని బైక్ కూడా నిలిపివుంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మొత్తం 250 సీసీటీవీ ఫుట్ జ్‌లను పరిశీలించి, ఎట్టకేలకు నిందితులను పట్టకున్నారు.  

ఎస్పీ రాజేష్ సింగ్ భదౌరియా మాట్లాడుతూ పిపిలియా బాజ్ ఖా నివాసి సునీల్ నామ్‌దేవ్(26) బీజేపీ నేత దగ్గర డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం అతని తండ్రి కైలాష్ నామదేవ్ ఆలయానికి బయలుదేరాడు. ఇంటికి 100 మీటర్ల దూరంలో కుమారుడు అనుమానాస్పద స్థితిలో రక్తపు మడుగులో పడివుండటాన్ని అతను గమనించాడు. వెంటనే కైలాష్ తన కుమారుడిని ఆసుపత్రికి తరలించాడు. అక్కడి వైద్యులు సునీల్‌ను పరిశీలించి అప్పటికే మృతి చెందాడని తెలిపారు. వెంటనే ఈ విషయాన్ని మృతుని తండ్రి పోలీసులకు తెలియజేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపధ్యంలో పోలీసులు మొత్తం 250 సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రశ్నించగా ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులను వివరించారు. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో తాము ఆరుగురం కారులో గ్రామం నుంచి వస్తుండగా, వెనుక బైక్‌పై సునీల్ వస్తున్నాడన్నారు. అయితే ఇంతలో అతని బైక్ తాము ప్రయాణిస్తున్న కారును ఢీకొన్నదన్నారు. దీంతో తమలో ఒకరైన నీలేంద్రకు, సునీల్‌కు గొడవ జరిగిందన్నారు. ఈ నేపధ్యంలో నీలేంద్ర.. సునీల్‌పై చేయి చేసుకున్నాడన్నారు. ఆ తరువాత తామంతా కలిసి కత్తితో అతనిని పొడిచి హత్య చేశామన్నారు. ఈ ఉదంతంలో నిందితుడిని దాచినందుకు నీలేష్ కుటుంబ సభ్యులను కూడా పోలీసులు విచారిస్తున్నారు.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement