Chitrajyothy Logo
Advertisement
Published: Sun, 26 Jun 2022 15:18:34 IST

Vijay 'వారసుడు' లో హిట్ సాంగ్ రీమిక్స్..?

twitter-iconwatsapp-iconfb-icon

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) హీరోగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త చిత్రం వారసుడు (Varasudu). ఇటీవలే ఈ సినిమా టైటిల్ ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలారు మేకర్స్. విజయ్ 66వ మూవీగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ బ్యానర్లపై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే, తాజా సమాచారం మేరకు ఈ సినిమలో ఓ సూపర్ హిట్ సాంగ్‌ను రీమిక్స్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. 

రష్మికా మందన్నా (Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళంలోనూ ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. విజయ్ నటిస్తున్న మొదటి తెలుగు స్ట్రైట్ సినిమా ఇది. ఇటీవల ఆయన బర్త్ డే సందర్భంగా మూడు లుక్కులను విడుదల చేసిన చిత్ర బృందం ఇప్పుడు రీమిక్స్ సాంగ్‌ను పెట్టాలని ప్లాన్‌లో ఉందట. విజయ్ నటించి యూత్ మూవీలోని హిట్ సాంగ్ ‘అల్ తూట్టా బూపతి’ సాంగ్‌ను రీమిక్స్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సిమ్రాన్ ఈ సాంగ్‌లో సందడి చేసింది. శంకర్ మహదేవన్ పాడారు. తమిళంలో ఈ పాట అప్పట్లో మాస్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది.

ఇదే పాటను తెలుగులో కూడా ప్రభాస్ నటించిన 'రాఘవేంద్ర' చిత్రంలో 'కలకత్తా పానేసినా చూసుకో' అనే లిరిక్స్‌తో పెట్టారు. తెలుగులోనూ ఈ పాట సూపర్ హిట్. ఇప్పుడు ఈ మాస్ సాంగ్ ఒరిజినల్ తమిళ్ వెర్షన్‌ను ఇప్పుడు విజయ్ నటిస్తున్న ‘వారసుడు’ మూవీలో ప్లాన్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇదే నిజం అయితే ఖచ్చితంగా ఆల్బంలో ఇది మంచి హిట్ సాంగ్‌గా నిలుస్తుందనడం సందేహమే లేదు. చూడాలి మరి దీనిపై అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఎప్పుడొస్తుందో ఈ పాటలో విజయ్‌తో కలిసి చిందులేసేదెవరో. కాగా, ఈ సినిమా తమిళంలో ‘వారిసు’ పేరుతో విడుదల కానుంది. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement