Abn logo
Feb 28 2020 @ 12:47PM

హిట్ మూవీ రివ్యూ

స‌మ‌ర్ప‌ణ‌:  నాని

బ్యాన‌ర్‌:  వాల్ పోస్ట‌ర్ సినిమా

న‌టీన‌టులు:  విశ్వ‌క్ సేన్‌, రుహానీ శ‌ర్మ, భానుచంద‌ర్‌ త‌దిత‌రులు

సంగీతం:  వివేక్ సాగ‌ర్‌

సినిమాటోగ్ర‌పీ: మ‌ణికంద‌న్‌

ఎడిటింగ్‌:  గ్యారీ బి.హెచ్‌

నిర్మాత‌: ప‌్ర‌శాంతి త్రిపిర్‌నేని

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  శైలేష్ కొల‌ను


                          తాను చేయాల‌నుకుని బిజీ షెడ్యూల్స్ ఇత‌రత్రా కార‌ణాల‌తో చేయ‌లేని సినిమాలు చేయ‌డానికి, కొత్త టాలెంట్‌ను  ఎంక‌రేజ్ చేయ‌డానికి నాని నిర్మాత‌గా మారి ప్ర‌శాంతి త్రిపిర్‌నేనితో క‌లిసి వాల్ పోస్ట‌ర్ అనే బ్యాన‌ర్‌ను స్టార్ చేసి నిర్మాత‌గా మారాడు. తొలి ప్ర‌య‌త్నంగా `అ!` వంటి డిఫ‌రెంట్ సినిమా చేసి విజ‌యం సాధించాడు. వెంట వెంట‌నే సినిమాలు చేసేయాల‌నే ఉద్దేశంతో కాకుండా కాస్త గ్యాప్‌తో మంచి కాన్సెప్ట్ సినిమా చేయాల‌ని వేచి చూసి నిర్మించిన చిత్రం `హిట్‌`. `ఫ‌ల‌క్‌నుమాదాస్‌`.. అంత‌కు ముందు మ‌రికొన్ని చిత్రాలతో న‌టుడిగా గుర్తింపు సంపాదించుకున్న విశ్వ‌క్‌సేన్ హీరోగా శైలేష్ కొల‌ను అనే డెబ్యూ డైరెక్ట‌ర్‌తో నాని, ప్ర‌శాంతి రూపొందించిన `హిట్‌` ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుందా?  లేదా?  అనే విష‌యాల‌ను తెలుసుకోవాలంటే ముందు క‌థ‌లోకి వెళ‌దాం...


క‌థ‌:


విక్ర‌మ్ రుద్రరాజు(విశ్వ‌క్ సేన్‌) ఇన్వెస్టిగేటివ్ ఆఫీస‌ర్‌. సిటీలో క్రైమ్ రేటు త‌గ్గించ‌డానికి హోమిసైడ్ ఇంటెర్వెన్ష‌న్ టీమ్‌(హిట్‌)లో స‌భ్యుడుగా ఉంటాడు. ప‌లు కేసుల‌ను సాల్వ్ చేసే క్ర‌మంలో చిన్న‌ప్పుడు అత‌ని జీవితంలో జ‌రిగిన కొన్ని ఘ‌ట‌న‌ల కార‌ణంగా త‌ను మాన‌సికంగా ఇబ్బంది ప‌డుతుంటాడు. డాక్ట‌ర్స్ రెస్ట్ తీసుకోమ‌ని చెప్పినా వినిపించుకోడు. త‌న డిపార్ట్‌మెంట్‌కి చెందిన లేడీ ఆఫీస‌ర్ నేహ‌(రుహానీ శ‌ర్మ‌)ను ప్రేమిస్తాడు. నేహా కోరిక మేర‌కు ఆరు నెల‌లు సెల‌వులు తీసుకుంటాడు. రెండు నెల‌ల త‌ర్వాత నేహా మిస్ అయ్యింద‌ని తెలిసిన త‌ర్వాత విక్ర‌మ్ లీవ్ క్యాన్సిల్ చేసుకుంటాడు. కానీ నేహా కేసుని మ‌రో ఆఫీస‌ర్ కంట్రోల్‌లో ఉంటుంది. అయినా కూడా నేహా ఇంట్లోకి వెళ్లిన విక్ర‌మ్ కొన్ని క్లూలు సేక‌రిస్తాడు. అదే స‌మ‌యంలో నేహా హ్యాండిల్ చేసిన ప్రీతి అనే అమ్మాయి మిస్సింగ్ కేసుకి, నేహా క‌న‌ప‌డ‌కుండా పోవ‌డానికి ఏదో సంబంధం ఉంద‌నిపించ‌డంతో విక్ర‌మ్ ప్రీతి కేసుని ఇన్వెస్టిగేట్ చేయ‌డం ప్రారంభిస్తాడు. క్ర‌మంగా ప్రీతి కేసులో అనుకోని నిజాలు తెలుస్తాయి. ఆ నిజాలేంటి? అస‌లు ప్రీతి ఎవ‌రు? ఆమె క‌న‌ప‌డ‌కుండా పోవ‌డానికి, నేహా క‌న‌ప‌డ‌కుండా పోవ‌డానికి గ‌ల కార‌ణాలేంటి?  అనే విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 


స‌మీక్ష‌:


సినిమా తొలి ప‌దిహేను నిమిషాలు హీరో మానసికంగా ఎలా ఉంటాడు. కేసుల్లో ఎలా ఎంత తెలివిగా వ్య‌వ‌హ‌రిస్తుంటాడు. అనే విష‌యాలను చ‌క్క‌గా ఎస్టాబ్లిష్ చేశారు. విశ్వ‌క్ సేన్ పోలీస్ ఆఫీస‌ర్‌గా చ‌క్క‌గా న‌టించారు. ఐపీఎస్ ఆఫీస‌ర్‌లా హుందాగా అని కాకుండా క్యాజువ‌ల్‌గా క‌నిపించాడు. పోలీస్ ఆఫీస‌ర్ మాన‌సికంగా ఎలాంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొన్నాడు. దాని వ‌ల్ల జీవితంలో ఎలాంటి స‌మస్య‌ల‌ను చూశాడు. వృతిప‌రంగా త‌న‌కు ఎదురైన సవాళ్లేంటి? అనే ప్ర‌శ్న‌ల‌కు త‌న బాడీలాంగ్వేజ్‌తో చ‌క్క‌గా ఎలివేట్ చేశాడు. ఇన్వెస్టిగేష‌న్ స‌మ‌యంలో పోలీసులు ఎలా ప్ర‌వ‌ర్తిస్తారు? ఎంత తెలివిగా ఆలోచిస్తారు? అనే విష‌యాన్ని కూడా చూపించారు. తొలి ముప్పై నిమిషాల త‌ర్వాత హీరో కోణంలో స‌మ‌స్య మొద‌ల‌వుతుంది. సినిమా త‌ర్వాత అంతా హీరో, అత‌ని ప‌రిష్క‌రించాల్సిన కేసు చుట్టూనే తిరుగుతుంటుంది. రుహానీ శ‌ర్మ పాత్ర చిన్న‌దే పాత్ర ప‌రంగా ఆమె చ‌క్క‌గా న‌టించింది. ఇక బ్ర‌హ్మాజీ, ముర‌ళీశ‌ర్మ‌, భానుచంద‌ర్ పాత్ర‌ల‌న్నీ చక్క‌గాగానే ఎలివేట్ చేశారు. అంద‌రూ వారి వారి పాత్ర‌ల ప‌రిధి మేర‌కు చ‌క్క‌గా న‌టించారు.

ఫ‌స్టాఫ్, సెకండాఫ్‌లలో రెండు కాస్త సాగ‌దీత‌గా ఉంటాయి. అయితే ఫ‌స్టాఫ్ కంటే సెకండాఫ్ మ‌రి కాస్త లాగిన‌ట్లు ఉంటుంది. కొన్ని కొన్ని సీన్స్ ఫ‌స్టాఫ్‌లో ఔట‌ర్ రింగురోడ్డులో ముర‌ళీ శ‌ర్మ సీన్‌ను చూస్తే ఆ సీన్‌ను అంతగా చూపించాలా? అనిపిస్తుంది. అలాగే సెకండాఫ్‌లోనూ సినిమాను సాగ‌దీసిన‌ట్లుగా అనిపించింది. ఇక సినిమాలో చివ‌ర‌కు వ‌ర‌కు స‌స్పెన్స్‌ను మెయిన్ టెయిన్ చేశారు కానీ.. ఆ స‌స్పెన్స్ రివీల్ అయిన త‌ర్వాత అదేంటి? ఇంతేనా? అని అనిపించొచ్చు. కానీ కొన్ని ఘ‌ట‌న‌ల‌కు చిన్న ఎమోష‌న్సే కార‌ణ‌మ‌నుకుంటే ఓకే. ఆ థ్రిల్లింగ్ పాయింట్ మ‌నం ఏదో ఊహించుకున్న‌ట్లుగా ఉండ‌దు. క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ ఉండ‌వు. అలాంటి సినిమాల‌ను ఎంజాయ్ చేయాల‌నుకునే ప్రేక్ష‌కుల‌కు సినిమా న‌చ్చుతుంది. క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌ను ఎంజాయ్ చేయాల‌నుకునే ప్రేక్ష‌కుల‌కు సినిమా న‌చ్చ‌దు.

వివేక్‌సాగ‌ర్ త‌న నేప‌థ్య సంగీతంతో సినిమాలోని స‌న్నివేశాల‌ను ఎలివేట్ చేశారు. మ‌ణికంద‌న్ కెమెరా ప‌నిత‌నం బావుంది. ఎడిట‌ర్ గ్యారీ మ‌రో ప‌ది నిమిషాల పాటు త‌న క‌త్తెర‌కు ప‌ని చెప్పొచ్చు.


చివ‌ర‌గా.. హిట్‌.. ఎంగేజింగ్‌ థ్రిల్ల‌ర్‌.. అయితే ఊహించినంత  మాత్రం కాదు

రేటింగ్‌: 2.75\5


Advertisement
Advertisement
Advertisement