Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sat, 26 Mar 2022 16:36:58 IST

IPL 2022: చెన్నైకే విజయావకాశాలు.. చరిత్ర చెబుతున్నది ఇదే!

twitter-iconwatsapp-iconfb-icon
IPL 2022: చెన్నైకే విజయావకాశాలు.. చరిత్ర చెబుతున్నది ఇదే!

ముంబై: ప్రపంచవ్యాప్తంగా  క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ మెగా టోర్నీ మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతోంది. 2021 ఫైనల్స్‌లో తలపడిన జట్ట మధ్య పోటీతో ఈ ఐపీఎల్ ప్రారంభం కాబోతోంది. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే), కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ సాయంత్రం ఏడున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. 


గత ఫైనల్‌లో జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని కేకేఆర్ కసిగా ఉంది. అయితే, గత చరిత్ర మాత్రం విజయం చెన్నైదేనని చెబుతోంది. గత 14 సీజన్లలో ఈ రెండు జట్లు 25సార్లు తలపడ్డాయి. సీఎస్‌కే 17సార్లు జయకేతనం ఎగురవేయగా, కేకేఆర్ 8సార్లు మాత్రమే చెన్నైపై పైచేయి సాధించింది. అలాగే, ఈ రెండు జట్లు రెండుసార్లు ఫైనల్స్‌లో తలపడ్డాయి. రెండు జట్లు చెరో మ్యాచ్‌లో విజయం సాధించాయి. గత సీజన్‌లో కప్పు గెలిచిన చెన్నై మొత్తం ట్రోఫీలను నాలుగింటికి పెంచుకుంది. 


కేకేఆర్‌పై చెన్నై సూపర్ కింగ్స్ చేసిన అత్యధిక స్కోరు 220 పరుగులు కాగా, సీఎస్‌కేపై కోల్‌కతా చేసిన అత్యధిక స్కోరు 202 పరుగులు. ఈ రెండింటి మధ్య జరిగిన ఒక మ్యాచ్ టై అయింది. వాంఖడేలో కేకేఆర్ చాలా తక్కువ మ్యాచ్‌లు ఆడింది. ఈ స్టేడియంలో ముంబై ఇండియన్స్ చేసిన 198 పరుగులకే అత్యధికం. 2019లో పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదిస్తూ ముంబై చేసిన పరుగులివి. 


2021 సీజన్‌లో సీఎస్‌కే-కేకేఆర్ మూడు మ్యాచుల్లో తలపడగా మూడింటిలోనూ చెన్నై విజయం సాధించింది. ఈ రెండు జట్లు చివరిసారి తలపడిన మ్యాచ్‌లో చెన్నై 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో సీఎస్‌కే 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ప్రతిగా కేకేఆర్ 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. 


కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ అత్యధికంగా 20 వికెట్లు తీసుకోగా, పీయూష్ చావ్లా 10, ఆండ్రూ రసెల్ 8 వికెట్లు తీసుకున్నారు. ఇక, అత్యధిక వ్యక్తిగత స్కోరు విషయానికి వస్తే సీఎస్‌కే బ్యాటర్ ఫా డుప్లెసిస్ 95 పరుగులు(నాటౌట్) చేయగా, కేకేఆర్ బ్యాటర్ మన్విందర్ బిస్లా 92 పరుగులు చేశాడు. 


ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ రెండూ కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగుతున్నాయి. చెన్నైకి రవీంద్ర జడేజా, కోల్‌కతాకు శ్రేయాస్ అయ్యర్ సారథ్యం వహిస్తున్నారు. ధోనీ నుంచి పగ్గాలు అందుకోవడంతో జడేజాపై విపరీతమైన ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. శ్రేయాస్ అయ్యర్ మాత్రం గతంలో ఢిల్లీ కేపిటల్స్‌కు సారథ్యం వహించడంతో అతడికి కావాల్సినంత అనుభవం ఉంది. 


ముంబై పిచ్‌పై తొలి ఓవర్లలో బంతి స్వింగ్ అవుతుంది కాబట్టి టాస్ గెలిచిన జట్టు దానిని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది. కాగా, సీఎస్‌కే-కేకేఆర్ మధ్య చివరిగా జరిగిన ఐదు మ్యాచుల్లో నాలుగింటిలో చెన్నై విజయం సాధించింది. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.