Abn logo
Mar 2 2021 @ 01:07AM

హిస్టారికల్‌ యాక్షన్‌

‘కె.జి.యఫ్‌’ స్టార్‌ యశ్‌ హీరోగా నటించిన కన్నడ చిత్రం ‘గజ కేసరి’. తెలుగులో ఈ నెల 5న అదే పేరుతో విడుదల కానుంది. ఎస్‌.కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నిర్మాతలు రామారావు చింతపల్లి, ఎం.ఎస్‌. రెడ్డి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. వాళ్లిద్దరూ మాట్లాడుతూ ‘‘హిస్టారికల్‌ యాక్షన్‌ చిత్రమిది. తెలుగులో ఇటీవల ‘భీష్మ’లో నటించిన అనంత్‌ నాగ్‌ కీలక పాత్రలో నటించారు. కన్నడలో మంచి విజయం సాధించింది. తెలుగు ప్రేక్షకులనూ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. అమూల్య కథానాయికగా నటించిన ఈ చిత్రానికి వి. హరికృష్ణ సంగీత దర్శకుడు.

Advertisement
Advertisement
Advertisement