Hisense: అదిరిపోయే ఫీచర్లతో 70 అంగుళాల 4కే స్మార్ట్‌టీవీ..

ABN , First Publish Date - 2021-07-15T00:48:42+05:30 IST

Hisense: అదిరిపోయే ఫీచర్లతో 70 అంగుళాల 4కే స్మార్ట్‌టీవీ..

Hisense: అదిరిపోయే ఫీచర్లతో 70 అంగుళాల 4కే స్మార్ట్‌టీవీ..

న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ మల్టీనేషనల్ టెక్నాలజీ సంస్థ హిస్సెన్స్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. భారత మర్కెట్‌లో అద్భుత ఫీచర్లతో హిస్సెన్స్ 70 అంగుళాల 4కే స్మార్ట్‌టీవీని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ పేర్కొంది. జూలై నెలలో 65 అంగుళాల మోడల్ టీవీని ప్రవేశపెట్టనున్నట్లు సంస్థ పేర్కొంది. భారతదేశంలో ఇ-కామర్స్ ప్లాట్‌ఫాంలు మరియు రిటైల్ దుకాణాల్లో టీవీలు లభిస్తాయని సంస్థ పేర్కొంది. హిస్సెన్స్ 70ఏ71ఎఫ్ 4కే స్మార్ట్ టీవీ డాల్బీ విజన్ మరియు డాల్బీ అట్మోస్ మద్దతుతో 70 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. 70ఏ71ఎఫ్ 4కే స్మార్ట్‌టీవీ రూ. 91,990 ఉంటుందని కంపెనీ పేర్కొంది.

Updated Date - 2021-07-15T00:48:42+05:30 IST