ఆయన తీరు ఇబ్బందికరం

ABN , First Publish Date - 2020-06-07T07:49:37+05:30 IST

‘కొవిడ్‌ 19 నివారణ చర్యల్లో ప్రాణాలను పణం గా పెట్టి పగలనక, రాత్రనక పనిచేశాం.

ఆయన తీరు ఇబ్బందికరం

 జేసీ-2పై కలెక్టర్‌ భాస్కర్‌కు వైద్యుల ఫిర్యాదు

 మంత్రి బాలినేనిని  కలిసేందుకు సిద్ధం


ఒంగోలు నగరం, జూన్‌ 6: ‘కొవిడ్‌ 19 నివారణ చర్యల్లో ప్రాణాలను పణం గా పెట్టి పగలనక, రాత్రనక పనిచేశాం. కరోనా రోగులకు భయపడకుండా చికి త్స అందించాం. అయితే జాయింట్‌ కలెక్టర్‌ తీరు మాత్రం మమ్మల్ని బాధిస్తోం ది.  తీవ్ర మానసిన క్షోభకు గురిచేస్తుంది’ అంటూ వైద్యఆరోగ్యశాఖ అధికారు లు, ప్రభుత్వ వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాయింట్‌ కలెక్టర్‌ చేతన్‌పై వైద్యఆరోగ్యశాఖ అధికారులు, ప్రభుత్వ వైద్యులు ఇప్పటికే కలెక్టర్‌ పోలా భాస్కర్‌కు ఫిర్యాదు చేశారు. రెండు మూడు రోజుల్లో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిసి జేసీపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. వైద్యులు, వైద్యఆరోగ్యశాఖాధికారుల పట్ల జేసీ అనుచితంగా ప్రవర్తిస్తున్నారంటూ గత కొన్నిరోజులుగా వైద్యఆరోగ్యశాఖ అధికారులు అసంతృప్తితో ఉన్నారు. శుక్రవారం జరిగిన ఘటన వైద్యఆరోగ్యశాఖ అధికారులకు మరింత బాధకు గురిచేసింది. డీఎంహెచ్‌వో  డాక్టర్‌ అప్పలనాయుడు, డిఫ్యూటీ డీఎంహెచ్‌వోల పట్ల జేసీ చేతన్‌ అనుసరించిన తీరు ఆ శాఖలో తీవ్ర  చర్చకు దారితీసింది. ఆయన పిలిచిన వెంటనే వెళ్లలేదనే కారణంతో డీఎం హెచ్‌వో, ఇద్దరు డిఫ్యూటీ డీఎంహెచ్‌వోలను గదిలో ఒక పక్కన  నిలబడి ఉండాలంటూ ఆదేశించి అవ మానపరిచారంటూ ప్రభుత్వ వైద్యులు చెబుతున్నారు.


ఫైళ్లను చూపించేందుకు వెళ్లిన వైద్యాధికారులను హేళనగా మాట్లాడుతున్నారంటూ గత కొద్దిరోజులుగా అసంతృప్తితో ఉన్న ఆ శాఖ అధికారులకు డీఎంహెచ్‌వో పట్ల కూడా జేసీ వైఖరి అలా ఉండటంతో ఇక లాభం లేదంటూ కార్యాచరణకు దిగారు. శనివారం పలువురు ప్రోగ్రాం ఆఫీసర్లు, ప్రభుత్వ వైద్యుల సంఘం నాయకులు మాతాశిశు వైద్యశాలలో సమావేశమై జేసీ వైఖరిపై చర్చించారు. ఆయన  వైద్యులను మాట్లాడుతున్నారంటూ అవమానకరంగా అభిప్రాయపడ్డారు. ఫైళ్లు చూపించేందుకు కానీ, చర్చించటానికి కానీ వెళ్లినప్పుడు కానీ  ‘మీ ఇష్టం ఇంటికి పంపిస్తా.. ఏం చదువుకున్నారు మీరు’ అంటూ అవమానకరంగా మాట్లాడుతున్నారని.. ఇక ఏ మాత్రం సహించకూడదని వారు సమావేశంలో తీర్మానించుకున్నారు. ముందుగా ఆయన వైఖరిపై కలెక్టర్‌ పోలా భాస్కర్‌ దృష్టికి తీసుకుపోవాలని,  మంత్రి బాలినేనికి కూడా జేసీ తీరును వివరించి తమకు న్యాయం చేయాలని కోరాలని నిర్ణయించారు. కాగా శనివారం కలెక్టర్‌ను కలిసి రిమ్స్‌ అధికారులు, వైద్యఆరోగ్యశాఖ అధికారులు కొందరు జేసీ వైఖరిపై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఇకపై ఇలాంటివి జరగకుండా చూస్తానని కలెక్టర్‌ వారికి హామీ ఇచ్చినట్లు తెలిసింది. తర్వాత డీఎంహెచ్‌ఓ కూడా కలెక్టర్‌ను కలిసి జరిగిన సంఘటనను వివరించినట్లు సమాచారం. కాగా ఆదివారం కాని, సోమవారం గాని జిల్లాకు రానున్న మంత్రి దృష్టికి తీసుకుపోవాలని ప్రభుత్వ వైద్యులు, వైద్యఆరోగ్యశాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. 

Updated Date - 2020-06-07T07:49:37+05:30 IST