మహోన్నతుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ

ABN , First Publish Date - 2022-09-28T05:54:16+05:30 IST

మహోన్నతుడు అచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీని ప్రతీ ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి అన్నారు.

మహోన్నతుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ
కొండా లక్ష్మణ్‌ బాపూజీ చిత్రపటం వద్ద జ్యోతి వెలిగిస్తున్న కలెక్టర్‌

- కలెక్టర్‌ వల్లూరు క్రాంతి

- జిల్లా వ్యాప్తంగా జయంతి వేడుకలు

- నివాళి అర్పించిన ప్రజాప్రతినిధులు, అధికారులు,  నాయకులు

గద్వాల క్రైం, సెప్టెంబరు 27 : మహోన్నతుడు అచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీని ప్రతీ ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవా రం నిర్వహించిన ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి వేడుకలకు ఆమె ముఖ్యఅతిథిగా హాజర య్యారు. లక్ష్మణ్‌ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి శ్వేతా ప్రియదర్శిని పాల్గొన్నారు. 


ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో...

    జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌ ఉన్నారు.


డీఆర్‌డీఏ కార్యాలయంలో...

    గద్వాల : డీఆర్‌డీఏ కార్యాలయంలో పీడీ నాగేం ద్రం, అడిషనల్‌ పీడీలు కొండా లక్ష్మణ్‌ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఎంపీ డీవో కార్యాలయంలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ చిత్ర పటానికి ఎంపీపీ ప్రతాప్‌ గౌడ్‌, ఎంపీడీవో రవీంద్ర పూలమాలలు వేసి నివాళి అర్పించారు. వ్వవసాయ కార్యాలయంలో డీఏవో గోవిందునాయక్‌, తహసీల్దార్‌ కార్యాలయంలో ఎమ్మార్వో వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. 


ధరూరు : ధరూరు మండల పరిషత్‌ కార్యాలయంలో ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతిని మంగళవారం  ఘనంగా నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఎంపీటీసీ సభ్యురాలు పద్మ ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్ర మంలో ఎంపీపీ నజీమున్సీసా బేగం, సీనియర్‌ అసిస్టెంట్‌ ఆనంద్‌, నాయకులు వెంకటేశ్వర రెడ్డి, రాజారెడ్డి, వెంకటేష్‌నాయుడు, అబ్రహాం, బుచ్చ న్న తదితరులు పాల్గొన్నారు. 


తెలంగాణ కోసం అవిశ్రాంత పోరాటం

గద్వాల టౌన్‌ : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం జీవితాంతం అవిశ్రాంత పోరాటం సాగించిన కొండా లక్ష్మణ్‌ బాపూజీ సేవలు చిరస్మరణీయమని జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ రామన్‌ గౌడ కొనియాడారు. లక్ష్మ ణ్‌ బాపూజీ జయంతిని పురస్కరించుకుని మంగళ వారం జిల్లా గ్రంథాలయం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి రామాంజనేయులు పాల్గొన్నారు.  


పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో..

కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతిని జిల్లా పద్మశాలి సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పాతబస్టాండ్‌ సర్కిల్‌లో ఆయన చిత్ర పటానికి సంఘం జిల్లా అధ్యక్షుడు, మాజీ కౌన్సిలర్‌ పులిపాటి వెంకటేష్‌ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ త్వర లోనే పట్టణంలో బాపూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తా మన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ మాజీ చైర్‌ పర్సన్‌ అక్కల రమాదేవి సాయిబాబ, కౌన్సిలర్‌ శ్రీమన్నారాయణ, మాజీ కౌన్సిలర్‌ సాయిబాబా, నాయకులు కాడిగి రాము, సురేష్‌, నీలి వెంకటస్వామి, గడ్డం శ్యాం, తిరుమల త్యాగరాజు, శాంతారం, మంత్రి సురేష్‌, శ్రీనివాసులు, శ్రీకాంత్‌, రామకృష్ణ, రామ స్వామి, రఘు ఉన్నారు. అనంతరం విగ్రహం ఏర్పా టుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కలెక్టర్‌ వల్లూరు క్రాంతి,  ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌, రోడ్లు, భవనాల శాఖ జిల్లా అధికారికి వినతిపత్రాలు ఇచ్చారు. 


గట్టు : మండల కేంద్రంలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి వేడుకలను చేనేత సహకార సంఘం మండల అధ్యక్షుడు దోమ వీరన్న ఆధ్వర్యంలో మంగ ళవారం ఘనంగా నిర్వహించారు. గట్టు బస్టాండ్‌ అవరణలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ని వాళి అర్పించారు. అనంతరం సహకార సంఘం కార్యాలయంలో సమావేశం నిర్వహించి కార్మికుల సమస్యలపై చర్చించారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు బుధారపు లక్ష్మీనారాయణ, చంద్రశేఖర్‌, తాండూర్‌ జయ్యన్న, చిన్న శంకరప్ప, కుణె ఈరణ్ణ పాల్గొన్నారు.


పదవ పోలీస్‌ బెటాలియన్‌లో..

ఇటిక్యాల : ఎర్రవల్లి చౌరస్తాలోని పదవ పోలీస్‌ బెటాలియన్‌లో మంగళవారం కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి వేడుకలు నిర్వహించారు. కొండా లక్ష్మణ్‌ బాపూజీ చిత్రపటానికి కమాండెంట్‌ బి.రామ్‌ప్రకాష్‌ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఇటిక్యాలలోని తహసీల్దార్‌, ఎంపీడీవో కార్యాలయాల్లో లక్ష్మణ్‌ బాపూజీ చిత్ర పటానికి తహసీల్దార్‌ సుబ్రహ్మణ్యం, ఎంపీడీవో రాఘవ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆయా కార్య క్రమాల్లో అసిస్టెంట్‌ కమాండెంట్‌ సాంబశివరావు, రెవెన్యూ అధికారులు సుదర్శన్‌రెడ్డి, ప్రశాంత్‌, అజిత్‌ కుమార్‌, రాజేష్‌, రాజారావు, శ్రీధర్‌ పాల్గొన్నారు.


రాజోలి : చేనేత సహకార సంఘం కార్యాలయంలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి వేడుకలు నిర్వహిం చారు. ఆయన చిత్రపటానికి చేనేత సహకార సంఘం అధ్యక్షుడు దోత్రె నారాయణ, సంఘం మేనేజర్‌ బి.శ్రీనివాసులు పూలమాల వేసి, నివాళి అర్పించారు.  కార్యక్రమంలో సంఘం సభ్యులు దోత్రె శ్రీనివాసులు, మహేశ్వరమ్మ, మల్లమ్మ పాల్గొన్నారు.


అయిజ : పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి వేడుకలు నిర్వహిం చారు. ఈ సందర్భంగా బాపూజీ చిత్రపటా నికి పార్టీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రరెడ్డి, అలంపూర్‌ నియో జకవర్గ కన్వీనర్‌ కన్వినర్‌ మెడికల్‌ తిర్మల్‌రెడ్డి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శేఖర్‌, పట్టణ అధ్యక్షుడు నర్సింహయ్యశెట్టి, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాదన్న పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-28T05:54:16+05:30 IST