వైరల్ వీడియో.. ప్రేయసి పెళ్లికి వెళ్లిన మాజీ ప్రియుడు.. నేరుగా వధువు దగ్గరకే వెళ్లి..

ABN , First Publish Date - 2021-06-18T22:24:49+05:30 IST

తన ప్రేయసి పెళ్లికి వెళ్లిన ఓ యువకుడి ప్రవర్తన సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది.

వైరల్ వీడియో.. ప్రేయసి పెళ్లికి వెళ్లిన మాజీ ప్రియుడు.. నేరుగా వధువు దగ్గరకే వెళ్లి..

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలోనూ దేశవ్యాప్తంగా పెళ్లిళ్లు జోరుగా జరిగిపోతున్నాయి. అయితే కొన్ని పెళ్లిళ్లలో జరుగుతున్న ఫన్నీ సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి నవ్వులు పూయిస్తున్నాయి. తాజాగా ఓ పెళ్లిలో జరిగిన అలాంటి సంఘటన వైరల్‌గా మారింది. తన ప్రేయసి పెళ్లికి వెళ్లిన ఓ యువకుడి ప్రవర్తన సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. 


ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే.. ఓ యువకుడు పెళ్లి వేదిక మీద ఉన్న వధువు దగ్గరికి ఏడుస్తూ వెళ్లి స్వీట్ నోట్లో పెడతాడు. ఆమె అది తినడానికి నిరాకరిస్తుంది. దీంతో దానిని ఆమె చేతిలో పెట్టి కన్నీళ్లు తుడుచుకుంటూ వెళ్లిపోతాడు. వీరిద్దరూ మాజీ ప్రేమికులని ప్రచారం జరుగుతోంది. అది ఎంత నిజమో తెలియదు కానీ.. వీడియో మాత్రం వైరల్‌గా మారింది. నిరంజన్ మహాపాత్ర అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశాడు. 



Updated Date - 2021-06-18T22:24:49+05:30 IST