వీసీ సర్కిల్ కొనుగోలు... హిందూస్తాన్ టైమ్స్ గ్రూప్ డిజిటల్ మీడియా లో కన్సాలిడేషన్

ABN , First Publish Date - 2020-07-30T22:39:58+05:30 IST

డిజిటల్ మీడియా రంగానికి డిమాండ్ పెరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే. దేశంలో ఇంటర్‌నెట్ వినియోగం పెరగటం, స్మార్ట్ ఫోన్ల వాడకం ఎక్కువైన తర్వాత... డిజిటల్ మీడియాకు, కంటెంట్ అందించే సంస్థలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది.

వీసీ సర్కిల్ కొనుగోలు... హిందూస్తాన్ టైమ్స్ గ్రూప్ డిజిటల్ మీడియా లో కన్సాలిడేషన్

న్యూఢిల్లీ : డిజిటల్ మీడియా రంగానికి డిమాండ్ పెరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే. దేశంలో ఇంటర్‌నెట్ వినియోగం పెరగటం, స్మార్ట్ ఫోన్ల వాడకం ఎక్కువైన తర్వాత... డిజిటల్ మీడియాకు, కంటెంట్ అందించే సంస్థలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది.


కరోనా వైరస్ ప్రపంచాన్ని కాటేసిన తర్వాత ఇప్పుడు ఏకంగా డిజిటల్ మీడియా నే ప్రధాన మీడియా గా ఎదుగుతోంది. ఇక రెవిన్యూ సంగతి ఎలా ఉన్నప్పటికీ ఆన్‌లైన్ పోర్టల్‌లకు పాఠకుల ఆదరణ అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ క్రమంలో... హెచ్‌టీ మీడియా చేతికి వీసీ సర్కిల్ వెళ్ళబోతోంది.


హిందూస్తాన్ టైమ్స్, మింట్, హిందూస్తాన్ వంటి పత్రికలను ప్రచురించే ప్రముఖ మీడియా గ్రూప్ హెచ్ టి మీడియా లిమిటెడ్ అన్న విషయం తెలిసిందే. తాజాగా... వీసీ సర్కిల్ అనే ప్రముఖ వెబ్ పోర్టల్ సంస్థను కొనుగోలు చేస్తోంది.


ఈ మేరకు కంపెనీ బీఎస్ఈ కి సమాచారాన్ని వెల్లడించింది. ఇక త్వరలోనే... వీసీ సర్కిల్ వంటి మరిన్ని కొనుగోళ్లు జరిగే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. 

Updated Date - 2020-07-30T22:39:58+05:30 IST