4 కిలోల బరువుతో శిశువు జననం

ABN , First Publish Date - 2020-04-04T10:15:48+05:30 IST

తసాధారణంగా మూడు కిలోల బరువుతో జన్మిస్తే ఆరోగ్యవంతమైన శిశువుగా వైద్యులు భావిస్తారు.

4 కిలోల బరువుతో శిశువు జననం

అనంతపురం అర్బన్‌, ఏప్రిల్‌ 3 :  తసాధారణంగా మూడు కిలోల బరువుతో జన్మిస్తే ఆరోగ్యవంతమైన శిశువుగా వైద్యులు భావిస్తారు. అయితే హిందూపురంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన సుశీల, ఈశ్వర్‌ దంపతులకు శుక్రవారం నాలుగు కిలోల బరువుతో మగశిశువు జన్మించాడు. ఈ సందర్భంగా ఈశ్వర్‌ తన సంతోషాన్ని ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నాడు.


ప్రతి వెయ్యిమందిలో ఒక శిశువు మాత్రమే నాలుగు కిలో బరువుతో ఆరోగ్యంగా జన్మిస్తారని డాక్టర్లు తెలిపారన్నారు. టైలర్‌గా జీవనాన్ని సాగిస్తున్నాని, కరోనా నేపథ్యంలో పనిలేకుండా పోయిందన్నారు. ఈ కష్టకాలంలో తన భార్యను ప్రసవం కోసం ప్రభుత్వ సర్వన ఆసుప్రతి తీసుకొచ్చానన్నారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు సిజేరీయన్‌ చేయాలని చెప్పడంతో ఒకింత భయానికి లోనయ్యానన్నారు.  నాలుగు కిలోల బరువుతో ఆరోగ్యంతమైన కుమారుడు జన్మించండం ఆనందంగా ఉందన్నారు.

Updated Date - 2020-04-04T10:15:48+05:30 IST