అంగరంగ వైభవంగా హిందూ టెంపుల్ ఆప్ గ్రేటర్ చికాగో తృతీయ పుష్కరోత్సవాలు

ABN , First Publish Date - 2022-08-08T20:55:37+05:30 IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు 1984లో శంకుస్థాపన చేసిన హిందూ టెంపుల్ ఆఫ్ గ్రేటర్ చికాగో36వ వార్షికోత్సవం ఆగస్ట్ 3వ తేదిన మొదలై 5రోజులపాటు అత్యంత వైభవంగా జరిగంది. ఈ సందర్భంగా HTG

అంగరంగ వైభవంగా హిందూ టెంపుల్ ఆప్ గ్రేటర్ చికాగో తృతీయ పుష్కరోత్సవాలు

ఎన్నారై డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు 1984లో శంకుస్థాపన చేసిన హిందూ టెంపుల్ ఆఫ్ గ్రేటర్ చికాగో36వ వార్షికోత్సవం ఆగస్ట్ 3వ తేదిన మొదలై 5రోజులపాటు అత్యంత వైభవంగా జరిగంది. ఈ సందర్భంగా HTGC అధ్యక్షులు బక్షిష్ రావల్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.  పెద్దహోమశాల ఏర్పాటు చేసి దాదాపు 30 మంది పూజారులను పలు ప్రాంతాల నుంచి చికాగోకు పిలిపించారు. వేదమంత్రాల ఉచ్ఛారణల మధ్య ఉత్సవాలు జరిగాయి. టెంపుల్ మాజీ అధ్యక్షలను ఈ సందర్భంగా నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.


టెంపుల్ ప్రథమ అద్యక్షులు డాక్టర్ విద్యాసాగర్ మాట్లాడుతూ.. ఆలయ నిర్మాణానికి పడ్డ వ్యయ ప్రయాసలను వివరించారు. తదుపరి అధ్యక్షులు డాక్టర్ క్రిష్ణారెడ్డి మందిర భవనాల నిర్మాణం గురించి మాట్లాడగా.. అత్యధికంగా నాలుగు పర్యాయాలు ప్రసిడెంటుగా పనిచేసిన భీమారెడ్డి కష్టపడి నిర్మించుకున్న ఈ ఆలయాన్ని కలిసికట్టుగా మరింత ఆదర్శవంతమైన మందిరంగా ముందుకు తీసుకెళ్దామని పిలుపునిచ్చారు.



మరొక మాజీ అధ్యక్షులు డాక్టర్ గోపాల్ శ్రీనివాసన్ మాట్లాడుతూ.. తనప్రెసిడెన్సీలో జరిగిన అభివృద్దిని వివరించారు. ఈ అభివృద్ధి తన ఒక్కరితోనే సాధ్యం కాలేదని... తనతో పని చేసిన కార్యవర్గ ఉద్యోగులు కూడా తీవ్రంగా శ్రమించారని చెప్పారు. HTGC ఆలయ కార్యదర్శి రోహిణి ఉడుప ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. అంతేకాకుండా మాజీ అధ్యక్షులు మొట్టమొదటి మహిళ ఆలయ అద్యక్షులు డాక్టర్ సుధారావు.. తరువాత అధ్యక్షులుగా పదవిని అలంకరించిన ప్రసన్నారెడ్డి ,కే వి రెడ్డి, వేమూరి సుబ్రహ్మణ్యం, అసుతోష్ గుప్తా, రేణుకారెడ్డి, శ్రీధర తంబరహల్లి, లక్ష్మన మీట్టూరు, సతీష్ అమృతూర్, తిలక్ మార్వాహలను సత్కరించారు. 


స్వర్గస్థులైన ఆలయ మాజీ అధ్యక్షులు హరిదత్ శర్మ, మాధవరెడ్డి, సొంపల్లి నాయుడుగారల సేవలను కొనియాడారు. అలగే వ్యక్తిగత కారణాల వల్ల ఆలయ మాజీ అధ్యక్షులు డాక్టర్ సుకన్యా రెడ్డి,డాక్టర్ నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్, డాక్టర్ బన్సీ శర్మ, GLN రెడ్డి , డాక్టర్ మారెళ్ల హనుమదాస్, అమ్రీష్ మహజన్, మనోహర్ రాఠి, మరియుకమల్ చావ్ల  సేవలను గుర్తిస్తూ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అందరితోపాటు ప్రస్తుత అధ్యక్షుడు బక్షీస్ రావల్‌ను కూడా సన్మానించారు. శ్రీ సీతారామచంద్ర తృతీయ పుష్కరోత్సవ బృహత్ కార్యక్రమానికి కావాల్సిన వలంటీర్ల అవసరాన్ని స్థానిక వెస్ట్ మాంట్ ఇండియన్ అసోషియేషన్ తీర్చింది.


Updated Date - 2022-08-08T20:55:37+05:30 IST