Advertisement
Advertisement
Abn logo
Advertisement

హిందూ సమ్మేళన్‌ రిహార్సల్‌

నల్లగొండ కల్చరల్‌, డిసెంబరు 5: ఆర్‌ఎ్‌సఎస్‌ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఎన్జీ కళాశాల మైదానంలో హిందూ సమ్మేళన్‌ రిహార్సల్స్‌ నిర్వహించారు. ఈనెల 12వ తేదీన ఆర్‌ఎ్‌సఎస్‌ నేషనల్‌ ఆల్‌ ఇండియా సెక్రటరీ జనరల్‌ దత్తాత్రేయ హోసబలే రానున్న సందర్భంగా నల్లగొండ జిల్లా ఆర్‌ఎ్‌సఎస్‌ నిర్వహించిన కార్యక్రమం ఆకట్టుకుంది. 800మంది ఆర్‌ఎ్‌సఎస్‌ స్వయంసేవకులు యూనిఫాంతో హాజరై వ్యాయామం, రూట్‌మార్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎ్‌సఎస్‌ జిల్లా సంఘ చాలక్‌ ఇటికాల కృష్ణయ్య, విభాగ్‌ సంఘ చాలక్‌ గార్లపాటి వెంకటయ్యలు మాట్లాడుతూ ఈనెల12వ తేదీన జరిగే ఆర్‌ఎ్‌సఎస్‌ హిందూశక్తి సంఘమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లాలోని స్వయం సేవకులు తరలిరావాలని పిలుపునిచ్చారు. 

 

Advertisement
Advertisement