200 కిలోమీటర్లు నడిచి సుప్రీంకోర్టుకు యువకుడు... కారణమిదే!

ABN , First Publish Date - 2021-07-29T17:01:15+05:30 IST

దేశంలో మతమార్పిడులకు పాల్పడుతున్న కొంతమందిని...

200 కిలోమీటర్లు నడిచి సుప్రీంకోర్టుకు యువకుడు... కారణమిదే!

న్యూఢిల్లీ: దేశంలో మతమార్పిడులకు పాల్పడుతున్న కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. వీరిలో ఇస్లాం మతంలోకి మారాలంటూ ప్రలోభాలకు గురిచేస్తున్నవారు ఉంటున్నారు. ఇటువంటి జాబితాలో యూపీలోని మీరఠ్‌కు చెందిన ప్రవీణ్ కుమార్ కూడా ఉన్నాడు. అయితే తన పేరు ఈ జాబితాలోకి తప్పుడు పద్దతిలో చేరిందని చెబుతున్నాడు. తనకు యూపీ ఏటీఎస్ క్లీన్ చిట్ ఇచ్చిందని చెబుతున్నాడు. 


అయినప్పటికీ తాను సమాజిక బహిష్కరణతో పాటు అనేక ఇక్కట్లను ఎదుర్కొనాల్సి వస్తున్నదని ప్రవీణ్ మీడియా ముందు వాపోయాడు. ఈ సమస్యను పరిష్కరించాలంటూ ప్రవీణ్ 200 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి, సుప్రీంకోర్టుకు చేరుకున్నాడు. మీడియాకు అందిన వివరాల ప్రకారం ప్రవీణ్ తన ప్రయాణంలో ఎండావానలను లెక్కచేయకుండా నడుచుకుంటూ సుప్రీంకోర్టుకు చేరుకున్నాడు. గత నెలలో మతమార్పిడుల ఉదంతంలో ప్రవీణ్‌ను షీతల్ ఖెడా గ్రామంలో ఎటీఎస్ అదుపులోకి తీసుకుని విచారించింది. ఈ నేపధ్యంలో గ్రామస్తులంతా అతని కుటుంబాన్ని వెలివేశారు. అంతటితో ఊరుకోకుండా అతని ఇంటి గోడలపై ‘ఉగ్రవాది’, ‘పాకిస్తాన్ వెళ్లిపో’ అనే నినాదాలు కూడా రాశారు. బెల్లం మిల్లులో అధికారిగా పనిచేస్తున్న ప్రవీణ్ 11 రోజుల పాటు నడిచి, సుప్రీం కోర్టుకు చేరుకుని తన అభ్యర్థనను సుప్రీంకోర్టుకు సమర్పించుకున్నాడు.

Updated Date - 2021-07-29T17:01:15+05:30 IST