40 ఏళ్ల క్రితం మిస్సైన అమ్మవారి విగ్రహం.. ఇంగ్లండ్‌లో దొరికింది!

ABN , First Publish Date - 2021-12-12T03:02:57+05:30 IST

స్మగ్లర్ల చేతుల్లో చిక్కుకుని దేశం దాటిన పురాతన దేవతామూర్తుల విగ్రహాలు ప్రభుత్వం చేస్తున్న కృషితో..

40 ఏళ్ల క్రితం మిస్సైన అమ్మవారి విగ్రహం.. ఇంగ్లండ్‌లో దొరికింది!

లండన్: స్మగ్లర్ల చేతుల్లో చిక్కుకుని దేశం దాటిన పురాతన దేవతామూర్తుల విగ్రహాలు ప్రభుత్వం చేస్తున్న కృషితో ఒక్కొక్కటిగా తిరిగి స్వదేశం చేరుకుంటున్నాయి. నాలుగు దశాబ్దాల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని ఓ ఆలయం నుంచి అపహరణకు గురైన మరో విగ్రహం త్వరలోనే స్వదేశం చేరుకోనుంది. 8 శతాబ్దం నాటి ఈ యోగిని విగ్రహం బండా జిల్లాలోని లోఖరీ గ్రామంలోని ఆలయంలో కొలువై ఉండేది. 1980 తొలి నాళ్లలో ఇది అకస్మాత్తుగా ఆలయం నుంచి మాయమైంది.


ఆ తర్వాత ఇన్నాళ్లకు ఆ యోగిని విగ్రహం ఇంగ్లండ్‌లో ఉన్నట్టు గుర్తించారు. ఆ వెంటనే భారత్ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు ప్రారంభించింది. యోగిని విగ్రహాన్ని భారత్ తీసుకొచ్చేందుకు అవసరమైన అన్ని ఫార్మాలిటీలు పూర్తయ్యాయని, మరికొన్ని నెలల్లో ఇది దేశం చేరుకుంటుందని  ట్రేడ్ అండ్ ఎకనమిక్ ఫస్ట్ సెక్రటరీ జస్ప్రీత్ సింగ్ సుఖిజా తెలిపారు. 

Updated Date - 2021-12-12T03:02:57+05:30 IST