Maharashtra: ముస్లిం అమ్మాయిని పెళ్లాడిన హిందూ అబ్బాయి దారుణ హత్య

ABN , First Publish Date - 2022-09-13T19:47:36+05:30 IST

ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ సిటీకి చెందిన దీపక్ బర్డె అనే హిందూ ..

Maharashtra: ముస్లిం అమ్మాయిని పెళ్లాడిన హిందూ అబ్బాయి దారుణ హత్య

ముంబై: ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ సిటీకి చెందిన దీపక్ బర్డె (Deepak Barde) అనే హిందూ అబ్బాయిని దారుణంగా హత్య చేశారు. తొలుత అపహరించుకు వెళ్లి, ఆ తర్వాత హత్య చేసి, అనంతరం మృతదేహాన్ని గోదావరిలోకి విసిరేశారు. ఈ ఘటనతో ప్రమేయమున్నట్టు అనుమానిస్తున్న ఏడుగురిని పోలీసులు అరెస్టు చేసి, విచారణ జరుపుతున్నారు.


ఈ హత్యా ఘటన బీజేపీ ఎమ్మెల్యే నితీష్ రాణా దృష్టికి రావడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. హత్యాఘటన సమాచారం ప్రకారం, బర్డే గత ఐదు రోజులుగా కనిపించకుండా పోయాడు. దీనిపై ఏకలవ్య ఆదివాసి సమాజ్ స్థానిక పోలీసులకు రెండుసార్లు ఫిర్యాదు చేసింది.


పెద్ద సంఖ్యలో లవ్ జీహాద్ కేసులు

కాగా, లవ్ జీహాద్ గురించి రాజ్యసభ ఎంపీ అనిల్ బాండే గతంలో పలుమార్లు ఆరోపణలు గుప్పించారు. అమ్రావతి జిల్లాలో పెద్ద సంఖ్యలో 'లవ్ జీహాదీ' కేసులు వెలుగు చూస్తున్నాయని, ఇంతవరరూ అలాంటి 20 కేసులు అమ్రావతిలో వెలుగుచూడగా, వాటిలో చాలా సందర్భాల్లో వివాహం అయిన తర్వాత అమ్మాయిల జాడ తెలియకుండా పోయిందని అన్నారు. అమ్మాయిలని కవ్వించి, వివాహం చేసుకుని ఆ తర్వాత వ్యభిచార వృత్తిలోకి దింపుతున్నారని, ముస్లిం కుటుంబాలు తమ మగ పిల్లల ప్రవర్తనపై దృష్టి పెట్టాలని ఆయన ఒక ట్వీట్‌లో అన్నారు.

Updated Date - 2022-09-13T19:47:36+05:30 IST