May 11 2021 @ 16:52PM

ఓటీటీలో హిందీ జెర్సీ ..?

షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్న సినిమా జెర్సీ. ఓటీటీలో ఈ సినిమాను రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయట. ఇంతకముందు దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే కోవిడ్ దెబ్బకి బాలీవుడ్ మార్కెట్ మొత్తం కుదేలయింది. దాంతో థియేటర్ రిలీజ్ అనుకున్న సినిమాలను పోస్ట్‌పోన్ చేసుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే బాలీవుడ్ మార్కెట్ ఎపుడు సెట్ అవుతుందో చెప్పలేకపోతున్నారట. దాంతో హిందీ జెర్సీని డైరెక్ట్‌గా ఓటీటీ రిలీజ్ చేస్తే బెటర్ అనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేయేషన్స్ - సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై బాలీవుడ్ నిర్మాత అమన్ గిల్‌తో కలిసి అల్లు అరవింద్, దిల్ రాజు, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. తెలుగు వెర్షన్ తెరకెక్కించిన గౌతం తిన్ననూరి ఈ సినిమాతో బాలీవుడ్‌లో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...