Abn logo
Jul 20 2021 @ 15:16PM

హిమాయత్‌సాగర్‌కు భారీగా వరద ప్రవాహం

హైదరాబాద్: హిమాయత్‌సాగర్‌కు భారీగా వరద నీరు చేరింది. దీంతో ఏ క్షణమైనా గేట్లు ఎత్తడానికి అధికారులు సిద్ధమయ్యారు. సాయంత్రం 4 గంటల తర్వాత హిమాయత్‌సాగర్ గేట్లు ఎత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1763 అడుగులు. ప్రస్తుతం 1762 అడుగులుంది. దీంతో హిమాయత్‌సాగర్ పరివాహక ప్రాంతాల్లో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.